శ్రీమన్నారాయణుని దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ పార్వతీపరమేశ్వరుల దశావతారాలు గురించి చాలామంది విని ఉండరు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట .దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తడం అవతారం అంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండి దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం భూమిపైన అవతరించు నని అని మన నమ్మకం..
🌷దశావతారములు దశమహావిద్యలు..🌷
🌷ప్రథమ అవతారం
మహాకాళుడు మహాకాళి అర్ధాంగి మహాకాళి వీరిరువురు భక్తులకు ముక్తిని ఇచ్చే దైవాలు...
🌷ద్వితీయ అవతారం
తారకావతారము .తారక దేవి ఈయన అర్ధాంగి. సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు..
🌷తృతీయ అవతారం
భైరవ అవతారము. భార్య భైరవి. ఉపాసన పరులకు కోరికలన్నీ ఇచ్చే దైవము భైరవుడు..
🌷చతుర్ధ అవతారము
ధూమ వంతుడు. ధూమావతి ఈయన శ్రీమతి..
🌷పంచమ అవతారము
ఛిన్నమస్త. ఛిన్నమస్తకి ఈయన పత్ని..
🌷ఆరవ అవతారం
షోడశి విశ్వేశ్వరుడు, షోడశి విద్యేశ్వరి ఈయన భార్య. భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు...
🌷ఏడవ అవతారము
బాల భువనేశ్వరావతారము. సహచరి భువనేశ్వరీదేవి .సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు..
🌷ఎనిమిదవ అవతారం.
బాగళాముఖుడు.బగళాముఖి ఈయన భార్య. మరో పేరు బ్రహ్మానంద.
🌷తొమ్మిదవ అవతారము
మాతంగుడు మాతంగి ఈయన భార్య..
🌷️దశమ అవతారము
కమలుడు ..కమల ఇతని అర్ధాంగి..సేకరణ..🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment