అంజనాద్రి
తిరుమల ప్రాంతాలలోని అడవులలో నివసిస్తూ తపస్సు చేసుకునే దైవభక్తులు కేసరి , అంజనాదేవి దంపతులు.
పవిత్ర ఆకాశగంగ పవిత్ర ఒడ్డున
దీర్ఘ తపస్సు చేస్తున్న ఆంజనాదేవిపై కరుణతో
వాయు భగవానుడు నిత్యమూ ఒక ఫలాన్ని ప్రసాదంగా
యిస్తూవుండేవాడు.
ఆ వరప్రసాద ఫలాల మహిమ వలన అంజనాదేవికి వానరరూపంలో ఒక మగ బిడ్డ జన్మించాడు.
అతిబలాఢ్యుడైన ఆ బాలుడు జన్మిస్తూనే
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అదొక ఎఱ్ఱని పండుగా
భావించి దానిని తినడానికి ఆకసానికి ఎగసివెళ్ళాడు.
అప్పుడు సూర్యభగవానునికి ఏ ముప్పు కలగరాదని దేవతలు బ్రహ్మదేవునికి మొరలిడగా
బ్రహ్మదేవుడు తన మంత్ర దండంతో
అంజనా పుత్రుని తల మీద మోదగా ఆ
బాలుడు మూర్ఛపోయి పడిపోయాడు. మాతృమూర్త అంజనాదేవి బ్రహ్మదేవుని ప్రార్ధించింది. బ్రహ్మదేవుడు ఆ బాలుని ఆశీర్వదించి,
కీర్తి ప్రతిష్టలతో, నిత్య చిరంజీవిగా
అందరి పూజలు అందుకొంటాడని ఆశీర్వదించాడు.
తిరుమలలో అంజనాదేవి
తపస్సు చేసిన స్ధలంలో
వాయుదేవుని వరప్రసాదంగా ఆంజనేయుడు జన్మించినందున ఆ స్థలానికి
'అంజనాద్రి' అనే పేరు వచ్చినట్లు తిరుమల స్థలపురాణాలు చెపుతున్నాయి...
No comments:
Post a Comment