మీ ప్రయత్నం కి అమ్మ కరుణ తోడై నవరాత్రి పూజ చేసి తరించండి..........
అమ్మ చల్లని కరుణతో మనందరి జీవితాలు మారిపోతాయి...అమ్మ మీద నమ్మకంతో పూజ చేసుకోండి...
నవరాత్రి పూజ ఇప్పటి వరకు చేయనివారికి ఎలా చేయాలో చూదాం.......
తేలికగా నవరాత్రి పూజ చేసే విధానం:-
దేవుడి గదిని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోని ఒక పీఠం మీద పెట్టుకోవాలి. కుంకుమ,పూవులు పక్కన పెట్టుకోవాలి.ఒక నియమం పెట్టుకోండి.పలానా సమయానికి పూజ చేసుకుంటాను అని..... ఉదయం 6కి, సాయంకాలం 6కి అని..ముందుగా సంకలపం చెప్పుకోవాలి.(అమ్మ నీ చల్లని కడగంటి చూపు మా మీద ప్రసరింపు తల్లి అని మనస్ఫూర్తిగా వేసుకోండి...)...ఎందుకంటే అమ్మ చూపు మన మీద పడితే మన భౌతిక కోరికలు అన్ని తీరి సుఖసంతోషాలతో జీవించగలుగుతాము.
తర్వాత షోడశోపచార పూజ చేసుకోండి..
తర్వాత ఈ నవరాత్రులు లో లలిత సహస్రనామము,దేవిఖడ్గమల, శ్రీదేవిభగవతము,కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది.శ్రీ లలితసహస్రనామము చదవడం మంచిది.శ్రీ లలితా సహస్ర నామం చదువుతూ కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిది..
పంచోపచారాలు పూజ..
ధూపం,దీపం,నైవేద్యం,తంబాలం,నీరాజనం(హారతి) ఇవ్వాలి..తర్వాత నమస్కారం చేసుకోండి..
నైవేద్యం ఎం పెట్టాలి...
పాయసనం,పులిహోర,బెల్లం అన్నం,ధధోజనం,పెసలు కలిపిన అన్నం...మీకు తోచినది ఏదో ఒకటి చేసి అమ్మకి నైవేద్యం పెట్టండి..
ఆఖరి రోజు దశమి.అంటే విజయదశమి ఆ రోజు సాయంత్ర సమయంలో...జమ్మి చెట్టుకి పూజ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యమైనవి...బ్రహ్మచర్యం పాటించాలి,సాత్విక మైన ఆహారం,నెల మీద పడుకోవాలి......
మనసుని అమ్మవారి మీద లగ్నం చేసి అమ్మ నామస్మరణ చేస్తూ ఉండాలి......
దుర్గమమైన కష్టాలను తొలగించే *శ్రీ దుర్గా మాత్రే నమః* అనే నామాన్ని నిత్యం నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి.అమ్మవారి శక్తిని అందుకునే ప్రయత్నం చేయాయండి.అందరూ దేవినవరాత్రుళ్ళు పూజ కచ్చితంగా చేసుకోండి...అమ్మ చల్లని చూపు మన మీద పడితే...అనీటిలోను విజయాలు,ఏదో తెలియని ధైర్యం అని మన సొంతమే అవుతుంది...
*యే మనుష్యః మాం ఆశ్రతః!*
*తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!*
No comments:
Post a Comment