క్షీరసాగర మథనం జరగడమే కాక యోగనిద్రనుండి మేల్కొనిన నారాయణుడు సకలదేవ, ఋషి, ముని గణాలకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. కనుకనే దీనికి హరిబోధిని ద్వాదశి అని కూడా నామాంతరం ఉంది.
శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవితో గూడి సకల పరివార సమేతుడై బృందావనానికి ఈ రోజున వస్తాడని పురాణ కథనం.
కనుక ఈ రోజు సాయంత్రపు వేళ దంపతులు కలిసి తులసి కోటనే బృందావనముగా భావించి, తులసి, ఉసిరిక మొక్కల వద్ద శ్రీ లక్ష్మీనారాయణులను పూజించి, దీప మాలలను వెలిగించి దీపారాధన చెయ్యాలని శాస్త్రం.
సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయని దోషం, ఈ రోజున 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వలన తొలగుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో తులసీ కల్యాణాన్ని చేయడమనే సంప్రదాయం కూడా ఉంది. పెరుగును, గోవును దానం చేయడం ఉత్తమమని పురాణ వచనం..స్వస్తి.
No comments:
Post a Comment