‘శివ లింగ తమోద్భూతః కోటిసూర్య సమ ప్రభః ‘కోటిసూర్య ప్రకాశ సమానమైన శివలింగం , జ్యోతిర్మయ స్వరూపుడైన మహదేవుని ప్రతి రూపం .
పరమశివుని ఆరాధ్య రూపం ‘లింగం’. ఈ జగత్తు అంతా ‘ లింగము’ రూపంలోనే ఇమిడి ఉంది. శివుడు- శక్తి , ప్రకృతి – పురుషుడు వేరు కాదు ఒక్కటే. అదే ‘శివలింగం ‘ప్రకృతి స్వరూపమైన పార్వతి శివలింగమునకు పానవటమ్ .పురుషుడే మహాదేవుడు ఆయన స్వరూపమే ‘ లింగం’ .‘
శివశక్తుల ఏకత్వమే శివలింగము’ .లింగారాధన త్రిమూర్తుల ఆరాధనతో సమానం .మూలే బ్రహ్మ తధా మధ్యే విష్ణు: త్రిభువనేశ్వర:రుద్ర పరి మహాదేవః ప్రణవాఖ్య: సదాశివః ‘అర్ధం : శివలింగ మూలంలో బ్రహ్మ , మధ్యలో విష్ణువు , ఉపరిభాగమందు ‘ఓం’ కారస్వరూపుడైన సదాశివుడు ఉన్నారు .శివలింగం ‘ఓం’ కారస్వరూపం . ‘అ’ కార ,’ఉ’ కార , ‘మ’ కారముల రూపమే ‘ఓం’ కారము . ‘– తదేవ మూల ప్రకృతి ర్మాయాచగగనాత్మికా/తత ఏవ సముత్పన్నం జగ దేతఛ్చరాచరమ్//
అర్ధం: ఈ చరాచర జగత్తుకు ఆధారం , ఆవిర్భావ మూలం శివ లింగమే. శ’ కార ,’ ఇ’ కార, ‘వ’ కార సంయుక్తం శివ నామం . శ + ఇ + వ=శివ .‘శి’ అంటే శుభప్రదమని , ‘వ’ అంటే అమృతత్వం అని శాస్త్ర వచనం.
‘ఓ౦ నమః శివాయ ఓ౦ : –
ఓ౦కారంతు పరంబ్రహ్మ – సర్వమో౦కార సంభవమ్ఆ కారో కార మాంతాయ – ఓ౦ కారాయ నమో నమః
న : – నమస్తే దేవదేవేశ –
నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ – నకారయ నమో నమః
మః : – మహాదేవం మహాత్మానం –
మహాపాతక నాశనం మహనట వరం వందే – మ కారాయ నమోనమః
శి :- శివం శాంతం జగన్నాధం –
లోకానుగ్రహ కారకమ్శివ మేక పదం దేవం – శి కారాయ నమో నమః
వా : – వాహనం వృషభోయస్య –
వాసుకీః కంఠభూషణమ్య : – యత్ర యత్ర స్థితో దేవః – సర్వ వ్యాప్తి మహేశ్వరాః యల్లింగం పూజయేన్నిత్యం
య - : కారాయ నమో నమః
భక్తి తో స్మరిద్ధాం ఓ౦ నమఃశివాయ . సృష్టి , స్థితి , లయ కారుడు శివుడు , ఆయనే త్రిమూర్తి స్వరూపుడు .
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే /శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః //శివుడు ఆయనే , విష్ణువు ఆయనే , శివుని హృదయం లో విష్ణువు – విష్ణువు హృదయం లో శివుడు నిత్యం కొలువై ఉంటారు . శివం కరోతితీ శివః శుభం కలిగించే వాడే శివుడు అనేది వేదవచనం ...స్వస్తి..🙏💐
ఓం నమః శివాయః..
No comments:
Post a Comment