Adsense

Tuesday, November 16, 2021

కార్తీక శుద్ధ ద్వాదశినేక్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు.

ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి*


కార్తీక శుద్ధ ద్వాదశినే
క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. 
దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు.

డబ్బుల పండగ
అని కూడా అంటారు
ఈ కార్యక్రమంలో పాల్గొని
తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం శ్రీ కృష్ణ శతకం పద్యాలు/పాటలు
పాడితే వివిధ రకాల ప్రసాదాలు మరియూ డబ్బులు ఇచ్చేవారు
అందుకే ఈ పండుగని
డబ్బుల పండగ
అనేవారు

🌹🌱🪔🙏🪔🌱🌹

 కృతయుగంలో 
ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది. 
అందుకే దీనికి 
చిలుకు ద్వాదశీ
అని పేరు. 

కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగర శయనుడైన శ్రీమహావిష్ణువు మేల్కొని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీ సమేతంగా తులసివనానికి తరలివస్తాడని ప్రతీతి.

 తులసి
 పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుని కుమార్తె. ఆమెను జలంధరుడు అనే రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశారు. జలంధరుడు ఈశ్వర అంశ సంభూతుడు. 

సముద్రపుత్రుడు కావడం వలన దేవతలు సముద్రుని నుండి వశపరచుకున్న కౌస్తుభమణి, కామధేనువు, 
కల్పతరువు 
మొదలైన వాటిని తనకు ఇవ్వవలసిందిగా ఇంద్రుడిని జలంధరుడు కోరాడు. 

అందుకు ఇంద్రుడు అంగీకరించకపోవడంతో ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు జలంధరుడు. 
జలంధరుడి భార్య ఎవరిని చూసి తన భర్త అని మోసపోతుందో అతని చేతులలోనే సంహరించబడతాడు 
అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు జలంధరుడు. 

ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని పొందిన శ్రీమహావిష్ణువు, జలంధరుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. అది తెలుసుకున్న జలంధరుడి భార్య శ్రీమహావిష్ణువును శిలగా మారిపొమ్మని శపించింది. అందుకు విష్ణువు తులసికి నీవు ఎప్పటికీ మొక్కగానే ఉంటావు మానుకావని ప్రతిశాపం ఇచ్చాడట. 

అదే సాలగ్రామ శిల పూజలో ఉండటానికి కారణం అని కథనం.  కార్తీక శుద్ధ 
ద్వాదశి రోజున విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, 
విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారు. 

ద్వాదశి
 రోజున చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన పత్తిని కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని 
పురాణ వచనం
ఉసిరిచెట్టు
 విష్ణు స్వరూపం కాగా, తులసి
 లక్ష్మీస్వరూపం. 

ద్వాదశి రోజున
 తులసి – దామోదర వ్రతం చేస్తారు 
(ఉసిరి చెట్టుకి – తులసి చెట్టుకి). 
ఈ కళ్యాణం చేస్తే శ్రీలక్ష్మీనారాయణుల వివాహం చేసిన ఫలితం కలుగుతుంది.
ఈ రోజున 
తులసి మొక్క
 దగ్గర దీపం

🌹🌱🪔🌱🪔🌹

 వెలిగించినవారికి శ్రీమహావిష్ణు కృప కలుగుతుంది. తులసివనంలో 
శ్రీకృష్ణుని విగ్రహం దగ్గర దీపారాధన చేస్తే  అనంతమైన 
పుణ్యం లభిస్తుంది. అంత్యంలో వైకుంఠానికి చేరుకుంటారు. తులసి వనంలో 
విష్ణువును

🌹🪔🪔🙏🪔🪔

 పూజించనివారికి పూర్వపుణ్యాలు నశించి నరకలోకానికి వెళతారు, కోటిజన్మల పాటు పాపిగా పుడతాడు. తులసివనంలో 
విష్ణువును

🌹🪔🪔🙏🪔🪔🌹

 పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం కంటే మహామహా పాపాలు నశించి పుణ్యాలు పొందుతారని పురాణం చెపుతుంది. తులసివనంలో వెలుగుతున్న దీపాల మధ్య ఉన్న 
శ్రీమహావిష్ణువు (ఉసిరిచెట్టు)ను దర్శించి నమస్కరిస్తే వారి కోరికలు వెంటనే తీరుతాయి. 
ఈ రోజున దీప దానం చేయడం
అత్యుత్తమం..

*కృష్ణం వందే జగద్గురుం*

No comments: