Adsense

Friday, December 3, 2021

కేరళ తమిళనాడు లో దీపాన్ని ప్రత్యక్ష దైవంగా కామక్షి స్వరూపంగా భావిస్తారు అమ్మవారిని దీపంలోకి ఆవాహన చేసి పూజిస్తారు...

దీపారాధన దీపంతో ఉపాసన

కేరళ తమిళనాడు లో దీపాన్ని ప్రత్యక్ష దైవంగా కామక్షి  స్వరూపంగా భావిస్తారు అమ్మవారిని దీపంలోకి ఆవాహన చేసి పూజిస్తారు

 అంటే అమ్మవారు ప్రత్యక్షంగా దీపం జోతిలో ఉండి పూజలు అందుకుంటుంది, 

ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు పెట్టుకుని నైవేద్యం పెట్టి లలితా సహస్త్ర నామం పారాయనఁ చేస్తారు అంటే అమ్మవారి  ముందు కూర్చుని లలిత చదివి నట్టు.. మీకు ఇది వరకు కూడా చెప్పాను,

 లలితా సామూహికంగా చేసే పారణంలో ఎన్ని విధానాలుగా చేస్తారు అనేది , ఈ కార్తీక మాసంలో ఇలా దీపం. ముందు పెట్టుకుని చేయడం విశేషం , అయితే రోజు కూడా పూజ గదిలో దీపం పెడతాము  అక్కడే చదువు తున్నాము కదా అనుకోవచ్చు అలా దీపారాధన చేయడం ఇలా దీపాన్ని ప్రత్యక్షంగా అమ్మవారుగా భావించి అందులో అమ్మవారిని దర్శిస్తూ చేసే ఉపాసన ఎంతో శక్తి వంతమైన ఉపాసన

 ఫోటో ముందు కూర్చుని చదవడానికి నేరుగా అమ్మవారి ముందు కూర్చుని చదవడానికి ఎంత తేడా ఉంటుంది కదా. అయితే ఇలా దీపానికి చీర కట్టి ఇలా నే చేయాలి అన్న నియమం లేదు మాములుగా దీపం పెట్టి దాని ముందు కూర్చుని చేయవచ్చు.

 అయితే ఇలా దీపాన్ని దేవతగా భావించి చేస్తునప్పుడు ఈమె ముందు మళ్ళి దీపం అటు ఇటు పెట్టాలి అక్కడ ఉన్న దీపం అమ్మవారుగా భావించి దీప ధూప నివేదన స్త్రోత్రం హారతి ఇవ్వాలి...

 సంగీతము నృత్యం తెలిసిన వాళ్ళు ఇలా పూజ చేశాక  స్వరార్చన ,నాట్య నివేదన, వాయిద్యం తో విశేష మైన ఆరాధన చేస్తారు.. అమ్మవారి ఎదురుగా ఉన్నప్పుడు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి శరణాగతి తో వినయం, ఆర్తీతో పూజించాలి..

ఒకసారి ప్రయత్నం చేయండి మీరు ఏకాగ్రతతో తల్లికి ఎదురుగా కూర్చుని చేస్తున్నాము అన్న భావన మనస్ఫూర్తిగా చేస్తే మీకు ఆ తల్లి అక్కడికి వచ్చిన అనుభూతి తెలిసి పోతుంది..శరీరం లోనుండి ఎదో శక్తి తరంగాలు ప్రవహిస్తుంది

 భావోద్వేగాలతో మాట రాదు కనుల్లో నీళ్లు  నిండి పోయి అందులో తామర లాగా దీపపు కాంతిలో ఆ తల్లి దర్శన మిస్తుంటే... లలితా సహస్త్ర నామం ఎక్కడ ఆగిపోయింది కూడా గుర్తు ఉండదు అలా ఎన్నిసార్లు నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటావో అన్ని సార్లు ఓడిపోయి ఆ తల్లి ప్రేమను గెలుచుకుంటారు.. 

దీప దుర్గా ఉపాసన కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది అంటే ఇలా చేస్తే ఇది  కూడా దీపదుర్గా ఉపాసన చేసిన ఫలితం ఇస్తుంది.
శ్రీ మాత్రే నమః..

No comments: