1.కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారి శుభకార్యాలు జరుగుతాయి.
2. రావిచెట్టు క్రింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారాయణస్వామి వారికి కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది.
3. కుజదోషం ఉన్న వారు మంగళవారం కాని శుక్రవారంనాడు
పూజచేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి
పప్పుతో బొబ్బట్లను చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11మంది
ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.
4. ఈశాన్య దిక్కుగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి
కొబ్బరినూనెతో దీపారాధన చేసి 40 రోజులు పూజ చేస్తారో వారికి
రావలసిన అప్పు వసూలు అవుతుంది.
5. ప్రతిదినం మహాలక్ష్మీకి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి,
కొబ్బరి, పంచదారను నైవెద్యంగాపెట్టి పూజిస్తారో వారింట్లో శుభ
కార్యాలు జరుగుతాయి.
6. పితృదేవతలకు (శ్రాద్ధాలు సమయములో కొబ్బరినూనెతో
దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్పర్గలోకాలు ప్రాప్తిస్తాయి.
7. ప్రతి శనివారంనాడు శ్రీ వెంకటేశ్వరస్వామివారికి.. కొబ్బరి
నూనెతో దీపారాధన చేసి, తులసీదళాలతో మాలకట్టి ప్రార్ధించి,
హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావు.
8. హరిద్వారలో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరి
నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు
జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది.
9. కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి
ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధనచేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు వేగంతో పూర్తి అవుతాయి.
10. దీపారాధన నువ్వుల నూనెతో చేస్తే కష్టాలు తగ్గుతాయి. కంటికి
సంబంధించిన వ్యాధులు మెల్లిగా తగ్గుతాయి.
సాధారణముగా దీపారాధనకు వేప నూనెను ఉపయోగించరు.
శాక్తేయులు, వామాచారులు,తాంత్రిక సాధకులు, మాంత్రికులు,
మాత్రం దుర్గాదేవికి, కాళీదేవికి, శక్తిదేవతలకు, ప్రత్యంగిరాదేవికి
శత్రువుల పీడ తొలగించుకునేందుకు వేప నూనెతో దీపారాధన
చేస్తారు. దీని వలన శత్రువులు వశీకరణ కలిగి దాని వలన శత్రువుల బలం తగ్గుతుంది.
No comments:
Post a Comment