కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత ధర్మరాజు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగి శ్రీకృష్ణుడిని తోడు రావలసిందిగా ఆహ్వనించాడు.
శ్రీకృష్ణుడు తనకు తీర్ధయాత్రలకు సమయము లేడని చెప్పగా, ధర్మరాజు రావాల్సిందే అని ఒత్తిడి చేయగా..
శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రతినిధిగా ఒక సొరకాయని ధర్మరాజుకి ఇచ్చాడు.
ధర్మ రాజు తన సిబ్బందితో ఆ సొరకాయని సకల తీర్ధాలలో ముంచి తిరిగి వచ్చాక, అది కృష్ణపరమాత్మకి ఇచ్చి కృష్ణపరమాత్మని తను చేయబోతున్న అన్న సమారాధనకి ధర్మరాజు ఆహ్వానించాడు.
కృష్ణ పరమాత్మ ఆ సొరకాయను వండి అందరికి వండి పెట్టమని ఆదేశించెను.
అప్పుడు ధర్మరాజు ఆ సొరకాయను అందరికీ ప్రసాదముగా పెట్టగా, చేదుగా ఉన్న ఆ సొరకాయ తిన్న అందరూ వాంతులు చేసుకొన్నారు.
ధర్మ రాజు శ్రీకృష్ణా.. నీవిచ్చిన సొరకాయ చేదైనది అని అనగా, శ్రీకృష్ణ పరమాత్మ ఓ అది చేదని నాకు ముందే తెలుసు.
అన్ని పుణ్యక్ధేత్రాలలో తిరిగి అన్ని తీర్ధాలలో మునిగినా, చేదు తీపి అవలేదనమాట అనగా, ధర్మరాజుకి మర్మం అర్దమై శ్రీకృష్ణపరమాత్మకి నమస్కరించింది.
చిత్తశుద్ధి లేకుండా ఎన్ని తీర్దయాత్రలలో శరీరాన్ని ముంచినా, మనసులో ఉన్న మాలిన్యము పోదు.
చేసిన పాపాలకి కర్మ అనుభవించక తప్పదన్నది ఈ సొరకాయ కధలో నీతిసూత్రము.
No comments:
Post a Comment