Adsense

Tuesday, February 1, 2022

నేడు పుష్య బహుళ అమావాస్య .. పురందరదాసు ఆరాధనోత్సవం.....!!


    భక్త పురందరదాసు..


కర్ణాటక సంగీత పితామహులు శ్రీ భక్త పురందరదాసు గారి జన్మదినం..

 పుష్యమాస బహుళ అమావాస్య, ఈ రోజు వారి సంగీత వాగ్గేయకారోత్సవములు దేశమంతటా జరుగును 

భక్త పురందర దాసు
‘’దాసరేంద్రే పురందర  దాసరాయ ‘’-దాస  భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు సంగీత కర్త, కవి అయిన వాగ్గేయకారుడు.  

కర్ణాటక సంగీతానికి  ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు. 

నారద మహర్షి అపర అవతారమనీ అంటారు దాసును.
వీరు దాదాపు 4 లక్షల 75 వేల  కీర్తనలు రచించారు.

ఆధ్యాత్మిక వేత్తలైన వారికి మాత్రమే బోధపడే శ్రీ  మద్ భాగవతాన్ని సుందర సరళతరమైన శ్రావ్యమైన పాటలు గా రాసి సామాన్యులకు కూడా భాగవత పరమార్ధాన్ని తెలియ జేశాడు.

 కర్ణాటక సంగీతం లో వ్రేళ్లమీద లెక్కింపదగిన వాగ్గేయకారుడిగా గుర్తింపుపొందాడు .

స్వరావళి ,అలంకారాలతో సంగీతానికి శోభ సమకూర్చాడు .’’మాయా మాళవ’’ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకొనే వారికి మొట్టమొదట పాడుకోవటానికి సులభంగా  ఉత్సాహ జనకంగా  వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు.

 ఇప్పటికీ  ప్రారంభదశ లో సంగీతం నేర్చుకొనేవారికి వారికి ఈ రాగ0 లోనే సంగీతం బోధించే సంప్రదాయం కొనసాగుతోంది
 స్వరావాలి ,జంటస్వరాలు ,అలంకారాలు ,లక్షణ గీత ,ప్రబంధాలు యుగభోగాలు ,దాటువరస గీతాలు ,సూలాది మొదలైనవి రాశాడు .

ఏదిరాసినా భావ రాగ లయ సమ్మేళనం తో విరిసిన పుష్పంగా కీర్తన శోభిల్లుతోంది .లక్షలాది కీర్తనలు రాసినా లభించి ప్రాచుర్యం లో ఉన్నవి 700 మాత్రమే .

పురందర దాసు భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పరిపోషించి వ్యాప్తి చెందించాడు.కన్నడం లో చాలా కీర్తనలు రాసినా, సంస్కృతం లోనూ పురందరదాసు కృతులు  రాసి కీర్తి గడించాడు. 

ఆయన కృతులలో ‘’పురందర విఠల ‘’అనేది అంకిత  ముద్ర గా ఉండటం విశేషం  

పుష్య బహుళ అమావాస్య నాడు పురందరదాసు ఆరాధనోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు .

 కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అందరికి ఆరాధనీయుడే..

No comments: