శ్యామలా దేవి జగన్మాతృకే! పాహిమాం...!!
నాల్గోవ రోజు :
🌹శ్రీ కళ్యాణ శ్యామలాయై నమః🌹
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
🌷దివ్యసింహాసనాసీనాం శుకవీణాలసత్కరామ్!
సంగీత మాతృకాం వందే వరదాం సుస్మితాననామ్!!🌷
మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజించడం అనేది శాస్త్రంలో చెప్పబడింది.
మొదటిరోజు నుండి క్రమంగా తొమ్మిది రోజులు
శ్రీ లఘుశ్యామలాయై నమః;
శ్రీ వాగ్వాదిన్యై నమః;
శ్రీ నకులీశ్వర్యై నమః;
శ్రీ కళ్యాణ శ్యామలాయై నమః;
శ్రీ జగద్రంజనీ మాతంగిణ్యై నమః;
శ్రీ వశ్యమాతంగిన్యై నమః;
శ్రీ సారికాయై నమః;
శ్రీ శుకశ్యామలాయై నమః;
శ్రీ రాజశ్యామలాయై నమః;
అనే ఒక్కొక్క నామంతో పూజించే పధ్ధతి కూడా ఉంది.
ఈవిషయంలో చాలా సందేహాలు కలుగుతాయి.
శ్రీవిద్య లేకుండా శ్యామలాదేవిని ఆరాధించవచ్చా?
ఆ దేవికి సంబంధించిన మంత్రం ఉండాలా? ఈ అమ్మవారి పూజ తాంత్రికమా? ఎవరైనా చేయవచ్చా?
శ్యామలాదేవి అంటే ప్రసిద్ధిగా తెలియదు అనేవారు కూడా ఉన్నారు.
కానీ వ్యవహారంలో ఎందరిలో ‘శ్యామల’ అనే పేరు ఉండడం సాధారణ విషయం.
అటువంటప్పుడు ఈవిడ అనాది కాలం నుండి సామాన్యులచే కూడా అర్చించబడి, వారిని అనుగ్రహించిన దేవతే అనేది సుస్పష్టం.
శ్యామలాదేవిని సాక్షాత్కరింపజేసుకున్న మహాకవి కాళిదాసు అప్పటికి
ఏ మంత్ర-తంత్రాలు లేకుండా కేవలం ‘అమ్మ’ అనే భావంతో కరుణించమని విలపించాడు.
ఆ నిష్కల్మషపు మనోవేదనకు అనుగ్రహించిన శ్యామలమ్మ ఎంతటి కరుణార్ద్ర హృదయోద్యోతకమవుతోంది.
కాలిదాసుకు ముందుగా ‘మాణిక్యవీణను మీటుతూ ఇంద్రనీలమణులవంటి కాంతి’తో ప్రత్యక్షమైన తల్లి వెనువెంటనే ‘నాలుగు చేతులలో పుండ్రేక్షు పాశాంకుశాలు ధరించిన మాత’గా మారిందంటే శ్యామలకు, లలితాదేవికి అభేదాన్ని గ్రహించవచ్చు.
అమ్మవారి ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులలో, ఇచ్ఛాశక్తి లలితాదేవి, క్రియాశక్తి వారాహీ దేవి కాగా, జ్ఞానశక్తిగా శ్యామలాదేవి చెప్పబడుతోంది...🚩🌞🙏🌹🎻
🌹ఓం శ్రీమాత్రేనమః🌹
No comments:
Post a Comment