Adsense

Friday, February 11, 2022

మధ్వనవమి....!!

 

భారతీయ దర్శనాల్లో మూడు ముఖ్య సిద్ధాంతాల్లో ద్వైతం ఒకటి. దాన్ని సూత్రీకరించి, ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞులు మధ్వాచార్యులు. వేదాలకు సరికొత్త భాష్యాన్ని రచించిన ఆయన అంతర్థానమైన రోజును మధ్వనవమిగా పాటిస్తారు. 

ఆ రోజు మాఘశుద్ధ నవమి. మధ్వాచార్యులు ఉడుపి అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుగా భాష్యం చెబుతూ గడిపారు.

 పవిత్ర సయమంలో సకల దేవతా సమూహం పుష్పవృష్టి కురిపిస్తుండగా ఆయన భక్తులందరి సమక్షంలో సశరీరంగా అంతర్థానమయ్యారని చెబుతారు. 

ఈ సందర్భంగా ఉడుపి అనంతేశ్వరాలయంలో మాఘ శుద్ధపాఢ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు.

 నవమి నాడు పర్యాయ పీఠాధిపతితో పాటు ఎనిమిది మంది పీఠాధిపతులూ సంస్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంత్రాలయంలో కూడా ఆ రోజు రథోత్సవం నిర్వహిస్తారు.

No comments: