తమిళనాడు సేలం జిల్లా అయోధ్యాపట్టణానికి సమీపాన
పెరియాణ్ డిచ్చి ఆమ్మవారి ఆలయం వుంది.
ఆ ఆలయ ప్రాంగణంలోని వృక్షాలపై
నివసించే గబ్బిలాలకు పూజలు చేయడం ఆచారంగా వస్తున్నది.
అయోధ్యా పట్టణం పేళూరు ప్రధాన మార్గంలో అగ్రహార నాట్టమంగళం గబ్బిలాల తోపు గ్రామం.
ఇక్కడి గ్రామస్తులు ఏటి ఒడ్డువద్ద భూమికి అడుగున వున్న అతి
ప్రాచీన పెరియాండవర్ ని తమ గ్రామ
రక్షణ దైవంగా పూజిస్తారు.
ఈ ఆలయంలో అర ఎకరంకు పైగా వున్న భూమిలో పెద్ద చింత తోపు వుంది . అందులోని చింతచెట్లలపై నూరు సంవత్సరాలకు
పైగా వందలాది గబ్బిలాలు గుంపులు
గుంపులుగా నివసిస్తూవున్నాయి.
రాత్రివేళల్లో చాలా దూరప్రాంతాలకు ఎరను వెతుకుతూ వెళ్ళే యీ గబ్బిలాలు పగటి పూట చెట్లకి వేలాడుతూ విశ్రాంతి తీసుకుంటాయి.
అందువలన యీ ప్రాంతానికి గబ్బిలాల తోపు అని పేరు.
100 సంవత్సరాలుగా ఉన్న చోటు మార్చకుండా ఆలయం
చెట్ల మీద గుంపులు గా
నివసించే యీ గబ్బిలాలను పూజిస్తారు.
తమ రక్షణ దైవమైన పెరియాండవర్
కి పూజలు చేసినప్పుడు
ఈ గబ్బిలాలకు కూడా పూజలు జరుపుతారు.
తరతరాలుగా నివసిస్తున్న గబ్బిలాలను బాధించకుండా వుండడమే కాకుండా గ్రామస్తులు
దీపావళి సమయంలో ఆ ప్రాంతాన
టపాకాయలు కాల్చకుండా వుండడం
మెచ్చుకోదగిన విషయం.
'ఇంటిపేరు కస్తూరి కాని
ఇల్లంతా గబ్బిలాల కంపు' అని మనకొక సామెత వుంది. దానికి విరుధ్ధంగా ఈ వూరి ప్రజలు గబ్బిలాలను పూజించడం చాలా గొప్ప విషయం.
దీనిని గురించి గబ్బిలాలతోపు గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే "పెరియాండిచ్చి చెట్ల మీద నివసిస్తున్న గబ్బిలాలు
దేవుని పిల్లలుగానే భావిస్తున్నాము. అమ్మవారిని పూజించినప్పుడు గబ్బిలాలను కూడా పూజిస్తాము. అంతేకాదు దీపావళి నాడు టపాకాయలు కాలిస్తే వాటివల్ల కలిగే వాతావరణ కాలుష్యం , శబ్ద కాలుష్యం
గబ్బిలాలను బాధిస్తాయి.
అందువలన మేము అక్కడ టపాకాయలు కాల్చము. గతంలో కొంతమంది ఆకతాయిలు గబ్బిలాలను బాధించి తరిమికొట్టగా
అవి తమ నివాసాన్ని మార్చుకున్నాయి.
తిరిగి ఆ ఆలయం చెట్ల మీద వుండే గబ్బిలాలను పిలవడానికి ఢమరకం, టముకు వాయించి , పొంగళ్ళు పెట్టి పూజలు
చేసి ఆహ్వానించడం జరిగింది.
మా ప్రార్ధనలతో వెళ్ళిపోయిన గబ్బిలాలన్నీ తిరిగి
రెండు రోజులలో తమ గూళ్ళకు చేరుకున్నాయి" అని అక్కడి గ్రామస్థులు తెలిపారు...సేకరణ
No comments:
Post a Comment