Adsense

Sunday, February 27, 2022

నేడు విజయ ఏకాదశి...!!

 
మాఘ మాసంలోని కృష్ణ పక్షo లో వచ్చు ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు.

 ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఫిబ్రవరి 27 ఆదివారం. అయితే ఈసారి ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రెండు రోజులు ఉంది  విజయ ఏకాదశి ...మనకు 27 ,వ తేదీ ఆదివారం మే లెక్క.. ఏకాదశి తిథి..

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, బ్రహ్మ ముహూర్తంలో విష్ణుమూర్తికి పూజలు చేసుకోవాలి

ఈ రోజున విష్ణుమూర్తిని  ఉపవాసం (పూజ ,వ్రతం) చేసుకుంటారు. ఈ ఏకాదశి వ్రతం కార్యాలలో విజయాన్ని ఇస్తుంది.  మహావిష్ణువు సంతోషించి మన కోరికలను తీరుస్తాడు అని శాస్త్రం

 విజయ ఏకాదశి రోజున ఏమి చేయాలో తెలుసుకుందాం. తద్వారా విష్ణువు ప్రసన్నుడవుతాడు.

 విజయ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు ఈ విధంగా సంతోషిస్తాడు

1. విజయ ఏకాదశి ఉపవాసం రోజున స్నానం చేసిన తర్వాత పసుపు బట్టలు ధరించడం మంచిది,

 ఎందుకంటే విష్ణువు పసుపు రంగును ఇష్టపడతాడు. పూజలో పసుపు పుష్పాలను సమర్పించండి.

2. విజయ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు పంచామృతాన్ని సమర్పించండి.
 ఇది లేకుండా విష్ణువు ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు.

3. విజయ ఏకాదశి రోజున తప్పకుండా తులసి ఆకులను సమర్పించండి. ఎందుకంటే విష్ణువు తులసికి ఆమె పూజలో ఉండమని వరం ఇచ్చాడు. తులసి ఏ పూజలో చేసినా తప్పకుండా ఉపయోగిస్తారు.

4. ఎవరైతే ఉపవాసం ఉంటారో, అతని ఉపవాస కథను తప్పనిసరిగా పఠించాలి. ఉపవాస కథను పఠించడం వల్ల పుణ్యఫలాలు, ఉపవాస ఫలాలు లభిస్తాయి.

 ఈ కారణంగా, మీరు విజయ ఏకాదశి ఉపవాస కథను కూడా పఠించాలి.

5. పూజ తర్వాత, విష్ణువు ఆరతి ఇవ్వండి. ఆరతి పూజకు పరిపూర్ణతను ఇస్తుంది.
 పూజలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని హారతి ద్వారా సంపూర్ణం..

విజయ ఏకాదశి కథ..!!

🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అన్నాడు  " ఓ వాసుదేవ , ఈ మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా "

     🌷*శ్రీ కృష్ణ పరమాత్మ :*🌷

ఓ యుధిష్టిర , ఈ మాఘ మాసం లో వచ్చే టువంటి ఏకాదశి పేరు *"విజయ ఏకాదశి"*. 

ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి. 

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను , అప్పుడు బ్రహ్మ ఈవిధంగా చెప్పనారంబించెను.

ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినావు కావున నీకు తెలియ చేసెదను వినుము . 

ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు. 

శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . 

రావణుడు సీతాదేవి ని అపహరించినప్పుడు శ్రీ రాముడు దిగులుతో అన్ని కోల్పోయినవాడిలా ఉండేను

 సీతాదేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినదని అడుగగా , జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సీతామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరణిస్తాడు .

 శ్రీ రాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు . 

అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంక కి వెళ్లి వెతకమని అజ్ఞాపిస్తాడు. 

  హనుమ లంకలో సీతమ్మని అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి , అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను. 

శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరానికి చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్నీ దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , 

ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలేను 

అందరిలోకి మంచివడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యం ఏమిటో కనుకుందాం. 

అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు. 

బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు . 

          🌷*బలదలబ్య*🌷

శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది .

No comments: