శ్రీ సతీ దేవీ ఆత్మాహుతి తర్వాత యుగాలుగా శివుడువిరాగియై యుండి లోక సంచారియై,హిమవత్పర్వతాలలో తీక్షణ యోగ ధ్యానములలో ఉండగా…
తారకాసురుడనే రాక్షసుడు కేవలం శివునికి కళ్యాణమై, తద్వారా జన్మించిన కుమారుడితోనే మరణం పొందేలా వరం పొంది దేవతలందరినీ జయించాడు.
ఈ రాక్షస సంహారానికై శివుని అమ్మవారి కళ్యాణం జరుగవలసి యుంది.
అమ్మవారు పూర్వజన్మలో శ్రీ దుర్గా మాత ( అశరీరి) వరముచే మేనకా హిమవంతులకు పుత్రికయై జన్మించి పార్వతీరిని పునీతులను చేసింది.
పెరిగుతూనే శివుని మీద అచంచల భక్తి భావమును పెంచుకుంటూ వచ్చెను. హిమవంతుడు మహా జ్ఞాని. అలా పెంచుకుంటూ ఒచ్చాడు కూతురైన అమ్మవారిని.
ఈలోగా నారదముని హితముచే పార్వతీ దేవి కేవలం శివునికే సతి అవుతుందని , దానికొరకు తపస్సు ఒకటే మార్గమని సెలవిస్తారు.
మేనకా దేవికి తన సుకుమార కూతురు అలా తపస్సుచేయుట అయిష్టమైనా, పార్వతీ దేవి ఆనందంతో శివునికై తపస్సు ప్రారంభిస్తుంది.
శివుడు హిమవత్పర్వతాలపై ఉన్నాడని తెల్సుకున్న తను , తండ్రి సహోయముతో శివుని సేవకై శివుని అనుమతి పొంది తనను అత్యంత భక్తి శ్రద్దలతో సేవించి పూజిస్తుంది అమ్మవారు.
అత్యంత కష్టం గగనం అయ్యే పని ఏంటంటే దేవతలందరూ శివుని మళ్ళీ పెళ్ళికి ఒప్పించుట.
వారందరి సలహా ఏంటంటే కాముని శివునిపై ప్రయోగించి పార్వతీ దేవినిపెళ్లాడే లాగా చేయాలని ఆలోచన.
భయ పడుతూనే మన్మధుడు ధ్యానంలో ఉన్న శివునిపై తన బాణప్రయోగాన్ని చేస్తాడు.
ఎందరో యోగుల హృదయాలను సైతం కదిలించిన మన్మధుని మన్మధ బాణం శివునిపై వేయగా , తనకు కలిగిన ధ్యాన భంగముకి , వికారానికి కారణాన్ని చూడగా ….
దూరాన కాముడు కనిపించగా ఒక్కసారి ఉగృడై మూడోకంటితో తనను భస్మము చేసెను శివుడు.
తరువాత మళ్లీ దేవతల , మన్మధుని భార్య రతీదేవి కోరికపై శాంతించి తనభార్యకు మాత్రమే కనిపించేలా బ్రతికించివరమిస్తాడు.
తరువాత అక్కడినుండి వెళ్లిపోతాడు శివుడు. మళ్లీ కధ మొదటికొస్తుంది. ఇంక పార్వతీ దేవి శివునికై ఘోరతపముకు సంకల్పం చేసుకుని , అన్నపానీయాలు సైతం మాని , ఆకులు తింటూ ఉగ్ర తపస్సు చేస్తుంది.
అందుకే అమ్మకు అపర్ణ అని నామధేయం. శివుడు సంతోషించి తనను మరొక్క సారి పరీక్షిద్దామని ముసలి బ్రాహ్మణ వేషధారియై పార్వతీ దేవి దగ్గర శివనింద చేస్తాడు.
శివుడు బట్ట కట్డడని, పాములు ఆభరాణాలుగా ఉంటాయని, శ్మశాన నివాసి యని తనని సరిగ్గా చూసుకోలేడని ఇలా రకరకాలుగా చెప్పగా , ఉమ ఉగృురాలై అతనిని తరిమేస్తుంది.
తక్షణమే శివుని ప్రత్యక్షమై సంతోషముతో తనని సాంప్రదాయబద్దంగా వివాహమాడతానని చెప్పి ఇంటికి వెళ్ళమంటాడు.
తరువాత సప్త ఋషిలను శివుడు హిమవంతుని దగ్గరుకి వెళ్లి తనపార్వతీ మాత పెళ్లికి పెద్దరికం వహించమంటాడు.
తరువాత వేదశాస్త్రోక్తంగా బ్రహ్మదేవుడే పురోహితుడై సకల దేవతల ఆనందోత్సాహాల నడుమ శివపార్వతులు పెళ్లి చేసుకుంటారు. ఇటువంటి కళ్యాణం నభూతోనభవిష్యత్.
తరువాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు శివపార్వతీ పుత్రుడిగా జన్మించి, దేవతల తరపున నాయకుడై తారకాసుర సంహారం గావిస్తాడు.
శివమహాపురాణం - రుద్ర సంహిత - పార్వతీ ఖండం నుండి కథ.
🙏శివర్పణమస్తు 🙏
No comments:
Post a Comment