ఒక సారి ఋషులు అందరూ కలసి శౌనకమహర్షి అధ్వర్యంలో ,యాగం చేయ తలపెట్టారు.
యాగసమయంలో అడ్డంకులు కలగకుండా వుండడానికి బ్రహ్మదేవుని , తగిన ప్రదేశం, యాగం చేయడానికి చూపించమని వేడుకున్నారు.
బ్రహ్మదేవుడు ఒక దర్భతో వలయం చేసి భూమి మీద నడిపించాడు. యీ వలయం ఆగిన చోట యాగం చెయ్యమని చెప్పి , మహర్షులను పంపాడు.
ఆ వలయం ఆగిన ప్రదేశమే నైమిశారణ్యం.
అది ఆగిన ప్రదేశం లో ఒక పల్లం ఏర్పడి జలం ఊరి ,జలప్రవాహంతో నిండి పోసాగింది.
ఇది చూసిన బ్రహ్మ జల ప్రవాహాన్ని, ఆపి ఋషులను కాపాడమని, పరాశక్తి ని కోరాడు.
పార్వతీ దేవి తన శక్తి తో జల ప్రవాహాన్ని నిరోధించింది. తరువాత ఋషులందరూ మహావిష్ణువు దర్శనానికి , పెద్దయాగం చేశారు.
ఆఖరున ఆ వలయంలో మహా విష్ణువు ప్రత్యక్ష మై ,యాగాన్ని స్వీకరించి , ఋషులను ఆశీర్వదించి, "నేను నిరంతరం ఇక్కడే వన రూపంలో వుండిపోతాను.
అని ఋషులను అనుగ్రహించి, అదృశ్యమైనాడు. ఆ వలయ చక్రం వున్న ప్రదేశమే నైమిశారణ్యం.
మహావిష్ణువు 'గయాథరుడు' అనే అసురుని తన చక్రాయుధంతో మూడు శక లాలుగా చేశాడు.
ఈ మూడు శకలాలు, గయ, నైమిశారణ్యం, బదరీనాధ్ లలో పడినట్లు చెప్తారు.
విష్ణు చక్రం పడిన ప్రదేశం లో పుష్కరిణి ఏర్పడి "చక్రతీర్ధం"గా పిలువబడుతున్నది.
ఈ స్థలంలోనే పార్వతీ దేవి 'శ్రీ లలితా దేవి'గా వెలసింది. శ్రీ లలితా శక్తి పీఠం గా పిలువబడుతున్నది.
గోమతీ నది లో స్నానం చేసి , అమావాస్య రోజున లలితాదేవిని దర్శించడం మహాభాగ్యం అని చెప్తారు.
చక్రతీర్ధం లో స్నానం చేసి లలితాదేవిని దర్శిస్తే, పాపాలన్ని తొలగి పోతాయని, చెప్తారు.
చక్రతీర్ధం లోతు అంతు తెలియని ది అని చెప్పినా, బ్రిటిష్ వారు నమ్మలేదు. 1000 మీటర్ల త్రాడుతో కొలచి, అంతు కనుగొనలేక ,విస్తు పోయారు.
భూమి మధ్య భాగము యీ నైమిశారణ్యం అని చెప్తారు. మహావిష్ణువు కి, శంకర నారాయణ, అనిమేష అనే పేర్లు వున్నాయి.
చక్రతీర్దం నుండి గోమతీనదికి వెళ్ళే మార్గం లో 'వ్యాస గడ్డి' అనే ప్రదేశంలో వ్యాసునికి ఆలయం వున్న ది.
18 పురాణముల ప్రతులు, నాలుగు వేదాలు మొదలైన తాళపత్ర గ్రంథాలు యిక్కడ జాగ్రత్తగా భద్రపరిచారు...
వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం.
No comments:
Post a Comment