ప్రపంచం నలుమూలలా వున్న భారతీయ ఆధ్యాత్మిక పరులంతా భక్తి శ్రధ్ధలతో జరుపుకునే మహోత్సవం.
శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా ఈ భూలోకంలో అవతరించిన దినం.
భూలోకవాసుల జన్మ సాఫల్యానికి
శ్రీ రామనామ మొక్కటే
తారకమంత్రము.
రామనామము మాత్రమే
ఎలా జపించినా మోక్షాన్ని ఇస్తుందట. రత్నాకరుడనే
దొంగ నారదుని ఉపదేశంతో
మరా,మరా అని జపించి రామ నామ మహిమతో వాల్మీకి మహర్షి అయినట్లు
పురాణాలు తెలుపుతున్నాయి.
శ్రీ రాముడు పురుషోత్తమునిగా కీర్తి పొందాడు. అతి సామాన్య ప్రాణియైన ఉడత (చిన్న జంతువు) నుండి గుహుడు( పురుషుడు)
జటాయు ( పక్షి) సుగ్రీవుడు( వానర రాజు)
శబరి( స్త్రీ), విభీషణుడు
( దానవకులం) అహల్య( ఋషి పత్ని)
వరుణుడు(దేవత)
ఇలా సకల ప్రాణులను సమానంగా ఆదరించి కరుణించాడు.
శ్రీమద్రామాయణాన్ని పారాయణం చేసేముందు
ప్రవచనం చెప్పేవారి ముందు ఒక ఆసనం అమర్చి దాని ముందు
ముగ్గు వేసి ధూప దీపాలు వెలిగించడం ఆచారం.
ఎక్కడ శ్రీరామాయణ
పారాయణం జరిగినా హనుమంతుడు వచ్చి
వింటాడని ఐహీకం.
కాంచి రామకృష్ణ యతీంద్రులవారు త్యాగయ్యను ఆశీర్వదించి " నీవు నీ జీవితంలో 96 కోట్ల సార్లు రామనామం జపిస్తే శ్రీ రాముని దివ్యదర్శనం
లభిస్తుంది, అంతిమ సమయంలో ఆయన పాదలచెంత ముక్తిని పొందగలవు" అని ఉపదేశించారట.
ఆవిధంగానే
త్యాగరాజస్వామి 21 ఏళ్ళలో అన్ని కోట్ల రామనామావళిని
జపించి అనేకసార్లు
శ్రీ రామ దర్శనం పొందారు.
కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో నిత్యం సాయం సమయాన సప్త ఋషులు పూజ చేసే సమయాన బిల్వదళాలపై చందనంతో శ్రీరామ నామాన్ని లిఖించి
వాటిని
కాశీవిశ్వేశ్వరునికి సమర్పిస్తారు. ఇలా చెసినందువలన కాశీకి
వచ్చిన సర్వుల
సకలపాపాలు తొలగి పోతాయనేది
ఐహీకం.
అన్ని మంత్రాలను ఉఛ్ఛరించడానికి, మనసు, దేహం నియమనిష్టలు పాటిస్తూ ధ్యానంలో వుండగానే ఉఛ్ఛరించాలి. కాని రామ నామం మాత్రం ఎప్పుడు యే పని చేస్తున్నా జపించ వచ్చును.
రామనామాన్ని
భక్తి శ్రధ్ధలతో జపించిన
ముక్తి లభిస్తుంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
రామానామాన్ని హనుమంతుని విగ్రహం ముందు జపించడం మంచిదని
పెద్దవారంటారు.
రామనామ జపంతో ఉన్నతమైన జ్ఞాన స్ధితికి
చేరుకున్నవారు అనేకమంది. రామానందులు, కబీరుదాసు, సమర్ధరామదాసు,త్యాగరాజస్వామి, భద్రాచల రామదాసు , యోగి రామశరత్కుమార్, మొదలైనవారు రామనామంతో ప్రసిద్ది చెందారు.
కౌశల్య పుత్రుడైన రామునికి రాముడని పేరు పెట్టేరే కాని ' రామ రామ ' అనేది ఋషులకాలం నుండి
ఉపనిషత్తులలొ చెప్పిన పేరు అని అంటారు.
రామేతి రామా అంటే ఆనందాన్ని ఇచ్చే వాడని అర్ధం.
శ్రీ భోదేంద్రస్వామి కాంచి కామకోటి పీఠానికి 59వ
పీఠాధిపతి. రామనామ గ్రంధాలను లోకానికి అందించారు.
రామనామాన్ని ఒక్కసారి ఉచ్ఛరించి తన దోషాలను పోగొట్టుకొన్న ఒక మహిళ దగ్గర భిక్ష తీసుకుని
రామ నామామృత మహిమను ఈ మహాజ్ఞాని తెలుసుకున్నారట.
" సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే' అని తెలుపుతున్నది విష్ణు పురాణం. శ్రీ రామనామాన్ని ఒక్కసారి
జపిస్తే మహావిష్ణువు సహస్రనామాలు జపించిన పుణ్యం లభిస్తుంది.
ఇది పరమేశ్వరుడు సతీదేవికి
చెప్పాడని పురాణాలు
చెప్తున్నాయి.
రామ నామాన్ని జపిస్తూ వుంటే మనసు ప్రశాంతంగా వుంటుంది.
దేహానికి చల్లదనం లభిస్తుంది. రక్తప్రవాహం క్రమబధ్ధీకరించ
బడుతుంది.
కుంటుంబ క్షేమం ,,అన్యోన్యమైన సంసారం,,,మంచి ఆలోచనలతో కుంటుబ ఆరోగ్యం బాగుపడుతుందని
గ్రంధాలు వివరిస్తున్నాయి...స్వస్తి జై శ్రీరామ్..
No comments:
Post a Comment