🌀"మరో భద్రాద్రి" గొల్లలమామిడాడ"
💠 శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అయోధ్యలో అవతరించి లోక కళ్యాణార్ధం దుష్ట శిక్షణ గావించాడు. శ్రీరాముని అవతారం ఎందరికో ఆదర్శవంతం అయ్యింది.
కలియుగంలో భద్రాచల రాముడిగా అవతరించాడు. తన ఉనికి కంచర్ల గోపన్న ద్వారా నేటికి ప్రాశస్థమై ఉంది.
శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ శ్రీరాముడిగా భారతదేశంలో పూజలు అందుకోవటం, మానవజన్మలో అయిన అనుసరించిన జీవనవిధానంలోని గొప్పతనం వలన శ్రీరాముడుకు ఎందరో భక్తులు అయ్యారు.
కంచర్ల గోపన్న నిర్మించిన భద్రాచలం తర్వాత మరో భద్రాచల రాముడుగా పిలువబడుతోంది గొల్లల మామిడాడ దేవాలయం.
💠 దీనిని నిర్మించిన భక్తులు ద్వారంరెడ్డి సుబ్బిరెడ్డి, అన్నదమ్ములు తమ స్వంత ఆస్థులను విక్రయించి నిర్మించిన దేవాలయం ఇది.
తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురంలో గొల్లల మామిడాడ అను గ్రామంలో నిర్మించబడిన ఈ దేవాలయం అనేక విశిష్టతలను కలిగి ఉంది.
ఈ రామాలయ నిర్మాణం ఎంతో అందంగా ఉండటమే గాక ఎంతో శిల్పకళా నైపుణ్యం దాగి ఉంది.
👉 గొల్లల మామిడాడ - అలయ నిర్మాణం
💠 గౌతమీ నది తీరంలో కశ్యప మహర్షి ఆశీస్సులతో ప్రవహించు గోదావరి నది అంతర్వాహినిగా కలిగిన గ్రామం గొల్లల మామిడాల.
గొల్లవారు ఎక్కువగా నివసించుటచే, అనేక మామిడి తోటలు కలిగి ఉండటం వలన ఈ పేరు వచ్చింది.
💠చాలా పెద్ద ఎత్తు కలిగిన తూర్పు, పశ్చిమ గోపురాలు కల్గియుండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ క్షేత్రం చూసి తరించిన వాళ్ళ కళ్లల్లో ఆనందాన్ని చెప్పటానికి సాధ్యం కాదు. ఇక్కడి గోపురాలు, అద్దాల మేడ, ద్వజస్థంభం, శిల్ప కళా నైపుణ్యం, ఇక్కడ దేవతల విగ్రహాలు అందర్నీ ముగ్ధుల్ని చేస్తాయి.
💠 మన రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద రామాలయాల్లో అతిపెద్ద దేవాలయం భద్రాచలం.
తర్వాత అంతగా పేరు ప్రఖ్యాతులు, కళ్యాణం, పూజలు అందుకుంటోన్న దేవాలయం ఈ గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం.
💠 ఈ ఆలయ నిర్మాణం క్రీ. శ. 1889లో మొదటిగా శ్రీ విష్ణుమూర్తి స్వప్నంలో సాక్షాత్కరించి చేప్పగా శ్రీ సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే సోదరులు నిర్మాణం చేశారు.
తర్వాతి కాలంలో 24-31934లో పున:నిర్మాణం చేస్తూ 1947 సం||లో 64 స్తంభాలు గల విశాలమగు పుష్పక విమానం, మంటపాన్ని నిర్మించారు.
ఒక యోగి ఈ ఆలయాన్ని సందర్శించి నివాసం ఏర్పర్చుకొని ఇక్కడనే సమాధి చెంది మరల సమాధినుండి బయటకు వచ్చి ఎటులనో వెళ్ళిపోయారు. ఈ ప్రదేశమునందు ఆయన జ్ఞాపికార్ధం తూర్పుగోపురం నిర్మించారు. పశ్చిమగోపురం 200 అడుగుల ఎత్తులో 9 అంతస్థులు కల్గి ఉంది.
ఈ గోపురం చుట్టూ అత్యంత కళాత్మకమైన దేవతామూర్తులను చెక్కియున్నారు.
💠 ఇక్కడ ప్రతిష్టించబడిన శ్రీకోదండ రామచంద్రమూర్తి, శ్రీ సీతామహాదేవి, శ్రీ లక్ష్మణస్వామి, వీరికి ఎదురుగా వేరే ఆలయంలో రాములవారికి నమస్కరించే శ్రీ ఆంజనేయస్వామి వారిని ప్రతిష్ట చేశారు. ఇక్కడ ఉన్న ఉత్సవ మూర్తులు ప్రతీరోజూ అనేక పూజలు, సేవలు అందుకుంటున్నారు.
💠 శ్రీరామనవమి, హనుమజ్జయంతి, రాష్ట్రంలో రెండవ అతి పెద్ద సీతారాముల కళ్యాణం ఇక్కడ జరుగుతాయి.
భక్తుల కోరికలు తీర్చే శ్రీరామప్రభువు కథలు అనేకం ఇక్కడ చెప్పుకుంటారు.
💠 ఇక్కడ జరుగు పూజాకార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జీవిత పరమార్ధం ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటే తప్పకుండా తెలుస్తుందనేది అందరి నమ్మకం, ఇక్కడ ద్వజస్తంభం, ఆలయ నిర్మాణం పసిడి రేకులతో కళకళలాడుతూ ఉంటాయి. తూర్పు, పశ్చిమ గోపురాలు, అంతస్థులు ప్రతీ ఒక్కరూ ఎక్కి దర్శించుకుంటారు. శ్రీరామపుష్కరిణికి అభిషేక జలము, తెప్ప తిరుణాళ్ళు, వసంతోత్సవం, చక్రస్థానం నిర్వహిస్తారు.
👉 అద్దాలమేడ :
💠ఇక్కడ ఉన్న అద్దాలమేడ నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది.
ఈ అద్దాల మేడలోకి ప్రవేశిస్తే, ఎన్నో వింతలు, విశేషాలు పిస్తాయి.
మన ఆకారం పలు వింతలుగా చిన్నా, పెద్ద, పదులు, వందలుగా కనిపిస్తాయి.
శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమ, సీతా దేవతా స్వరూపాలు ఒక్కొక్కటి పలురకాలుగా దర్శనమిస్తాయి.
ఈ అద్దాల నిర్మాణం మానవుని మేదస్సుతో కూడి ఉంది.
👉 శిల్పకళా నైపుణ్యయం
💠 మహర్షులు, దేవతా పురాణాలు, గాయత్రీదేవి, కాళికాదేవి, ఆయుధములు ధరించిన శివుడు, అహల్యా శాపవిబేచనం వంటివి ఇక్కడ నిర్మాణంలో ముచ్చట గొలుపుతాయి.
💠 మన రాష్ట్రంలో చూడదగ్గ క్షేత్రాలలో ఈ పుణ్యక్షేత్రం పూర్తి సంతృప్తినిస్తుంది. ఇక్కడ నిర్మాణం, గాలిగోపురాలు, అద్దాలమేడ, గ్రామంలో కనిపించే మేడలు అందరికీ ఒక తీపి గుర్తును మిగులుస్తాయి.
ఆ వాతావరణాన్ని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉండి విదేశీ టూరిస్టులను సైతం ఆకర్షిస్తుందనడము లో సందేహం లేదు. రాముడే దిగివచ్చి అక్కడ కొలువున్నట్లుగా అనిపిస్తుంది.
ఈ ఆలయ వచ్చినవాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలోని పచ్చని పంటపొలాలు కూడా చూసి వెళ్తారు.
No comments:
Post a Comment