💠 తెలంగాణ సంప్రదాయం పండుగలలో మొదటిది బోనాల పండుగ. ఆషాడ మాసంలో ఆదివారం నాడు గోల్కొండ కోటలో మొదలై నెల రోజుల పాటు సాగుతోంది. హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చివరగా బోనాల పండుగ ముగుస్తుంది.
ఈ పండుగని వీక్షించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు.
ఈ ఉత్సవం 2 రోజుల పాటు కొనసాగుతుంది.
మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం, రెండవ రోజు రంగం కార్యక్రమం.
💠 పోతరాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు, వివిధ డప్పుల దరువులు, బోనం ఎత్తిన మహిళల మధ్య అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదాలకి మంచినీటితో సాకగా పోస్తారు.
బోనం తయారి కోసం మొదటగా ఒక కొత్త కుండని కొనుగోలు చేసి, పవిత్రముగా అన్నాన్ని వండి ఈ కుండలో ఉంచి , కుంకుమ, పసుపు, వేప ఆకులతో అలంకరణ చేసి పూజ మొదలు పెడుతారు.
🔔 శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయచరిత్ర : 💠 పాతబస్తీలో ఎన్నో దేవాలయాలు ఉన్నపటికీ అందరిచే పూజలు అందుకుంటూ మొదటి స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి మాత ఆలయం.
💠 1908 లో మూసినదికి వరదలు వచ్చాయి. హైదరాబాద్ లోని ప్రజలు అందరు అతలాకుతలం అయిపోయారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న 6వ నిజాం ప్రభువు "మహుమూద్ అలీఖాన్ "కు అతని దగ్గర ప్రధానిగా పని చేసే "కిషన్ ప్రసాద్" ఒక సలహా ఇస్తాడు. వరద ముప్పు తగ్గుముఖం పట్టాలి అంటే లాల్ దర్వాజా లోని శ్రీ సింహవాహిని అమ్మవారి కి పూజలు చేయాలని సూచించారు.
అప్పుడు నిజాం ప్రధాని కిషన్ ప్రసాద్ ఇచ్చిన సూచన మేరకు 6వ నిజాం నవాబు గారు పూజలు నిర్వహించి ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు, మేలిమి ముత్యాలు , నగలు, బంగారు గాజులు పెట్టి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి వాటిని మూసీ నదిలో వదిలిపెడుతారు.
అలా మూసీ నదిలో వదిలి పెట్టడం వల్ల వరద తగ్గుముఖం పడుతుంది. హైదరాబాద్ ప్రజలు అందరు సుఖసంతోషాలతో జీవిస్తారు.
💠 అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆధీనంలోకి తీసుకున్నా తరువాత ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది.
💠 రెండవ రోజు రంగం, రధోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంనికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు ఒక మహిళా లోకి ఆవహించి భవిష్యత్ లో జరిగే పరిణామాలు, మొదలగు వాటిగురించి భవిష్యవాణి వినిపిస్తారు.
ఈ భవిష్యవాణి వినడానికి ప్రజలు భారీ ఎత్తున వస్తారు.
💠 రధోత్సవం లాల్ దర్వాజా ఆలయం నుంచి మొదలు పెట్టి అక్కన, మాదన్న ఆలయాలు కలుపుకొని, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల మీదుగా వెళ్తుంది.
💠 భోజనానికి రూపాంతరం బోనం. ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కృపవల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం ఈ సంప్రదాయం వెనుక పరమార్ధం.
- సేకరణ
No comments:
Post a Comment