Adsense

Friday, September 30, 2022

శరన్నవరాత్రులలో నాల్గవ నవదుర్గగా ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణ దేవి Bazawada Kanakadurga

శరన్నవరాత్రులలో నాల్గవ నవదుర్గగా ఇంద్రకీలాద్రి మీదా దుర్గమ్మ  శ్రీ అన్నపూర్ణ దేవి గా అలంకారములో దర్శనం ఇస్తున్నారు...!!



🌹శ్రీ అన్నపూర్ణా దేవి...

🌿అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.

🌸ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది.

🌿అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం,

🌸 సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి.

🌿బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.

🌸అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి." హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.

🌿అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.

No comments: