Adsense

Thursday, September 29, 2022

చిన్న‌శేష వాహ‌నంపై బ‌ద్రి నారాయ‌ణ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి.. Chinna Sesha Vahanam - Badri Narayana Alankaram - Tirumala brahmotsavam



           శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై  బ‌ద్రి నారాయ‌ణ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు

          పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

          రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

         

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

No comments: