రత్లాం - కాళికామాత ఆలయం
🌸ఎన్నో విశేషాలు కలిగిన ఈ ప్రసిద్ధ కాళికామాత ఆలయం మధ్యప్రదేశ్ లోని రత్లాం ప్రాంతం నడిబొడ్డున నిర్మించబడింది. ఈ ఆలయం మాల్వా ప్రాంత ప్రజల విశ్వానికి మారుపేరై, అతిపవిత్రమైన స్థలంగా భావిస్తారు.
🌿రోజూ వందల సంఖ్యలో జనం, ఏడాది పొడవునా దర్శనభాగ్యం, భక్తుల రద్ధీ ఎప్పుడూ ఉంటుంది.
🌸ఈ ఆలయం నవరాత్రుల సమయాల్లో భక్తుల రద్ధీకి చెప్పుకోదగ్గ రీతిలో కిటకిటలాడుతూ ఉంటుంది. అనాది నుంచి ఈ నగరవాసులు అమ్మ కాళిక దర్శనంతోనే రోజును ప్రారంభిస్తూ, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఈమె ప్రసిద్ధి.
🌿మూడు నవరాత్రులు.., ఛైత్ర, గుప్త, మరియు శారదా నవరాత్రులలో భారీగా భక్తులు తరలిరావడం వలన, పొడవాటి క్యూ లైన్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు అధిక సంఖ్యలో చేరుకుంటారు.
🌸ఆ రోజులలో జరిగే అమ్మవారి విశేష అలంకరణ భక్తులకు కన్నులవిందై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
🌿ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక ఘట్టం.. గర్భా నృత్యం:
🌸గర్భా అనేది గుజరాత్ రాష్ట్రం నుంచి ఉద్భవించిన ఒక నృత్య రూపం నామం.
సాంప్రదాయబద్ధంగా చేసే ఈ గుజరాతీ జానపద నృత్యం ఓ దీపం లేదా దేవీ ప్రతిమ చుట్టూ చేరి అనేక సంప్రదాయ గర్భాలు నిర్వహిస్తారు. ఇది దేవీ నవరాత్రుల సమయంలో ప్రదర్శించబడుతుంది.
🌿ఎక్కడ లేని విధంగా నవరాత్రులలో తెల్లవారు ఝామున 4 గంటలకే గర్భా నృత్యంతో అమ్మవారి పూజా కార్యక్రమాలు మొదలయ్యే ఆలయం ఇదే మొదటిది కావడం విశేషం.
🌸ఆలయ గర్భ గుడిలో గల కాళికామాత విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయ విశిష్టతలో గొప్పదీ, రత్లాంలో మాత్రమే చూడగలిగినది, కాళికాదేవీ, చాముండి, అన్నపూర్ణమ్మ ముగ్గురూ మూడు రూపాలలో ఇక్కడ ఒకేచోట దర్శనమివ్వడం విశేషం
🌿అమ్మవారికి సమీపంలో కుడివైపుకు తొండం తిరిగిన గణేషుడు కొలువై, పక్కనే అన్నపూర్ణాదేవీ విగ్రహం, ఎదురుగా శివలింగమూ ప్రతీష్టించబడి ఉన్నాయి.
🌸ఈ దేవాలయం యొక్క ప్రధాన ద్వారం చైత్యంలా తయారు చేయబడింది. వెండితో చేయబడిన ఆలయ ద్వారాలపై కాళీమాత, కృష్ణుని, హనుమంతుని, రాముని, సరస్వతీల బొమ్మలు చెక్కబడ్డాయి. అనేక శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో, బలి ఇచ్చే ఆచారం కూడా ఉండేది.
🌿ఇది రత్లాం రాజవంశీయుల కాలంలో నిర్మించబడినది. అప్పటి నుంచీ ఈ ఆలయ కాళికామాతా అక్కడి ప్రజల్ని కాపాడుతూ వస్తోందని ప్రతీతి.
🌸ఈ దేవాలయం సమీపంలో రాజా రంజిత్ సింగ్ మొదటి భార్య రాణి రాజ్‌కున్వర్ ఝాలి జ్ఞాపకార్థం, ఒక భారీ కొలను కూడా నిర్మించబడింది, ఇది ఝాలి తాలాబ్ అని ప్రసిద్ధి చెందింది. ఇది కాళికామాత సముదాయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతుంది.
🌿ఇందులో 52 మెట్లు ఉన్నాయి, 86 అడుగుల లోతుతో చెక్కిన ఎరుపు గులాబీ రాళ్లతో చేయబడిందీ కొలను.
🌸గుడి ప్రాంగణంలో వుండే అష్టభుజాలు కలిగిన ఈ కొలను దివ్వెల వెలుగులో ప్రకాశిస్తూ శోభాయమానంగా, చూడ చక్కటి కన్నుల పండువగా ఉంటుంది.
🌿అమ్మ దీవెనలు పొందితే తమ కోర్కెలు తప్పక నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవే కాక మరెన్నో విశేషాలు, చరిత్ర కలిగిన ఈ ఆలయం నిత్య పూజలందుకుంటూ శోభిల్లుతోంది...స్వస్తి..
No comments:
Post a Comment