Adsense

Wednesday, September 28, 2022

బ్రహ్మోత్సవాలలో ఈ రోజు రాత్రి హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్పస్వామి వారి వైభవం.. tirumala brahmotsavam hamsa vahanam

 బ్రహ్మోత్సవాలలో ఈ రోజు రాత్రి హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్పస్వామి వారి వైభవం......

🔆 హంస వాహన సేవ విశిష్టత :

       
💠 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుదవారం  రాత్రి  శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి  అలంకారంలో దర్శనమిస్తారు...

💠 హంసవాహనం - బ్రహ్మపదప్రాప్తి

💠 హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు.
ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.

💠 పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం.
ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం.
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

💠 శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి


💠  హంస మనలో ఉన్న శ్వాసకి ప్రతీక..
మన ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలే హంస తత్వం.
దీనికి పాలు నీరు వేరు చేసి చూపే శక్తి ఉంటుంది అని పెద్దలు చెబుతారు... అంటే జ్ఞాన, అజ్ఞాన విచక్షణ సత్య అసత్య విచెచన అని అర్థం , హంస శుద్ధ జ్ఞానముకు ప్రతీక .

💠 దీని మీద ఉండే స్వామి పరమ హంసలకు కూడా ధ్యేయం అయ్యిన వాడు ,భాగవతంలో భగవానుడు హంస రూపంలో బ్రహ్మకు,దక్షుని,నారదునికి దర్శనమిచ్చి చేసిన భోదను హంస గీత అని పిలుస్తారు.

💠 బ్రహ్మ దేవుడు చేసిన హంస గుహ్య స్తోత్రం కూడా మనకు శాస్త్రంలో ఉన్నది .

💠 హంస వాహనం మీద విహరించే పరమాత్మ ను దర్శించి ,సేవించి ,నమస్కారం చేస్తే జ్ఞానం కలుగుతుంది.

💠ఏది నిజం ఏది శాశ్వతం,ఏది సత్యం ,ఏది అసత్యం అన్న వివేకం కలుగుతుంది.
అన్ని రకాల బ్రాంతులు పూర్తిగా తొలగిపోతాయి...

💠 అలాంటి హంస వాహన సేవలో విహరించే మలయప్పస్వామి వారిని అందరూ దర్శించి స్వామి కృపకు పాత్రులు కాగలరు


🙏 ఓం నమో వెంకటేశాయ
🙏

No comments: