Adsense

Saturday, October 1, 2022

రేపు(01.10.22) ఇంద్ర కీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ



ఆరవ రోజు శ్రీ మహా లక్ష్మి దేవి అలంకరణ (శనేశ్వరుడు , కుజుడు , రాహువు , కేతువు , పూర్ణ చంద్రుడు)

చిలుక పచ్చ చీర (బుధుడు)
బెల్లం నైవేద్యం (శనేశ్వరుడు + బృహస్పతి)
పాయసం (శుక్రుడు , చంద్రుడు)
పటించవలసిన మంత్రము

*‘ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానయస్వాహా’*

అనే మంత్రాన్ని 1108 సార్లు పటించాలి

*మహాలక్ష్మ్యష్టకం*

ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే
స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ౧౦
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ౧౧

*(పదకొండు సార్లు పటించవలెను)*
ఆరవ రోజు అమ్మవారికి మహా లక్ష్మి దేవి అమ్మవారి అలంకరణ చేసి చిలుక పచ్చ రంగు చీరను అలంకరించి బెల్లమును , పాయసమును నైవేద్యముగా సమర్పించి పై  మంత్రాలను జపించవలెను.
ఈ అమ్మవారిని ఈ రోజు పూజించే సమయములో ఇంటిలో కిన్చెత్తు కూడా బూజు కానీ చెత్త బుట్టలలో చెత్త కాని ఉండకూడదు. అలాగే నీటిని ఉంచుకునే పాత్రలలో నీరు సమృద్ధిగా (నిండుగా) ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోను ఈ రోజు వివాదాలలో పాల్గొనడం కాని అనవసర ఆవేశానికి గురి కావడం కాని చెయ్యకూడదు. ఈ విధంగా ఇంట్లో పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంవలన శనేశ్వరుడి యొక్క ప్రభావం పెరిగి చేస్తున్న పనులలో ఆలస్యం అవ్వడము లేదా వృత్తి విషయములో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకించి ఈ పూజ చేసే సమయములో ఇంట్లో నీరు సమృద్ధిగా లేకపోవడం వలన చంద్రుడి యొక్క దుష్పరిణామాలు ఎదురవడం వలన అనవసర ప్రయాణాలు ఏర్పడి ధన వ్యయం జరగడం , లేదా మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
ఈ రోజు అనవసర వివాదాలలో పాల్గొనడం వల్ల కుజుడి యొక్క ప్రభావం పెరిగి రుణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.విద్యా పరమైన విషయాలలో ఆటంకం ఎదుర్కునేవారు ఈ రోజు మేనమామల యొక్క ఆశీర్వాదము తీసుకోవడము లేదా విఘ్నేశ్వరుడి గుడిలో ఈ రోజు గరిక తో అర్చన చేయించు కోవడం ద్వార శుభం జరుగుతుంది. ఉద్యోగ సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు నువ్వులు బెల్లము కలిపి ఉండలు తాయారు చేసి గోమాతకు తినిపించడం ద్వారా ఆయా విషయాలలో మేలు జరుగుతుంది.ఆర్ధిక పరమైన సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు సన్యాసులకు లేదా వృద్దాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఉల్లిపాయ ముక్కలు కలిపినటువంటి దద్దోజనాన్ని సమర్పించడం ద్వారా ధన వ్యయం తగ్గుతుంది.అలాగే అవకాశం ఉన్నవారు ప్రత్యేకించి వివాహం అయ్యిన స్త్రీలు ఈ రోజు పుట్టింటి వారి ఊరు కనుక దగ్గేరలో ఉంటె అక్కడకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మసాలా తో కూడి నటువంటి ఆహారమును కాని లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపినటు వంటి పెరుగన్నము కాని వారి స్వహస్తాలతో తాయారు చేసి వడ్డించి తినిపించడం ద్వారా జాతకములోని శని , చంద్ర దోషము పోయి అనవసర ధన వ్యయము తగ్గి ధన యోగం (అవసరమైన మేర) కలుగుతుంది అని మన పురాతనమైన జ్యోతిష్య నాడి , తాంత్రిక సిద్ధాంతములు చెబుతున్నాయి.

*గమనిక: ఈ రోజు పూజలో పాల్గొన్నవారు ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీల యొక్క మనసు నొప్పించారాడు అలాగే స్త్రీలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా కూడా గట్టిగ అరవడం కాని ఆవేశంగా మాట్లాడటం కాని ఖచ్చితంగా చెయ్యకూడదు.*

*శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

No comments: