Adsense

Saturday, October 1, 2022

రేపు(02.10.22) శ్రీశైలంలో కాళరాత్రీ దుర్గా అలంకరణ



కాళీ,మహాకాళీ,భధ్రకాళీ, భైరవి, మృత్యు , రుద్రాణి , చాముండా, చండీ , దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు.
కాళరాత్రి " శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును.మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ము చుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడల గ్రక్కుచుండును.ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము , మఱొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి యుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను *"శుభంకరి"* అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించి నంతమాత్రముననే దానవులు , దైత్యులు , రాక్షసులు , భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము.ఈమె యను గ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని , జలము , జంతువులు మొదలగువాటి భయముగాని , శత్రువుల భయముగాని , రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయ విముక్తులగుదురు.

*కాలరాత్రి ధ్యాన శ్లోకం*

*“ ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।*
*లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥*
*వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।*
*వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥ “*

No comments: