మన మహర్షుల చరిత్ర..
19వ మహర్షి కర్దమ మహర్షి గురించి తెలుసుకుందాము.
🌿కర్దమ మహర్షి. అయితే ఇతను అందరి కన్నా ముందు, అంటే కృత యుగం నాటి వాడు.
🌸 మహా విష్ణువునే తన కొడుకుగా పొందిన వాడు. తొమ్మిది మంది మునులకు తాతగారు.
🌿బ్రహ్మదేముడి మాట మీద సంతానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇతనిని కర్దమ ప్రజాపతి అని కూడా అంటారు.
ఇంత గొప్ప మహర్షి గురించి మనం తెలుసుకోవాలి కదా.
🌸బ్రహ్మ దేముడు గంధర్వులని, అప్సరసలని, సిద్ధులని, కిన్నెరలని, కింపురుషులని సృష్టించాకా ఋషులని సృష్టించాడు.
🌿వీరందరినీ ప్రజాసృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మదేముడు.
🌸ఒకరోజు బ్రహ్మ కర్దముడిని నువ్వు సృష్టికార్యంలో నాకు సహాయం చెయ్యాలి అని చెప్పాడు.
అందుకు కర్దముడు నీ మాట నేను ఎందుకు కాదంటాను సరేనన్నాడు .
🌿 ఒకసారి కర్దముడు సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి దర్శనం కోరి తపస్సు చేశాడు .
🌸 పదివేల సంవత్సరాలు అలా తపస్సు చేశాక విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏంకావాలో కోరుకో అన్నాడు .
🌿కర్దమ మహర్షి విష్ణుమూర్తిని చూసి ఆనందం పట్టలేక సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ ! నేను పెళ్ళి చేసుకోవాలని తపస్సు చేశాను .
🌸సృష్టి కార్యానికే గాని సుఖాలకోసం కాదు . నీ అనుమతి ప్రకారమే నేను కోరుకున్నాను అన్నాడు .
🌿కర్దముడి మాటలు విని విష్ణుమూర్తి మహర్షీ ! నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది . బ్రహ్మవర్త దేశపురాజు భార్యతో కలిసి నీ దగ్గరకు వచ్చి వారి కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చేస్తారు .
🌸నీకు తొమ్మిది మంది కూతుళ్ళు వాళ్ళకు గొప్ప మునులు పుడ్తారు . తర్వాత నువ్వు నాలోనే లోకాలన్ని వున్నాయనీ , నీలో కూడ నేనే ఉన్నానని తెలుసుకుని
🌿నన్నే పూజించు . నాఅంశతో నీ భార్య వలన నేనే కొడుకుగా నీకు పుడతాను అని చెప్పాడు .
🌸కర్దముడు మళ్ళీ తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు .
స్వాయంభువుడు భార్య శతరూపతోను , కూతరు దేవహూతితోను కలిసి వచ్చి తన కూతుర్ని పెళ్ళి చేసుకోమని అడిగాడు .
🌿కర్దముడు పెళ్ళి చేసుకుంటాను కాని పిల్లలు పుట్టేవరకే ఉంటాను , తర్వాత తపస్సు చేసుకుందుకు వెళ్లిపోతాను అన్నాడు .
🌸రాజు , భార్యని కూతుర్ని అడిగి వాళ్ళు సరే అన్నాక కర్దముడికి దేవహూతినిచ్చి పెళ్ళిచేసి తిరిగి వెళ్ళిపోయాడు .
🌿దేవహూతి తన భర్త అయిన కర్దముడికి సేవచేస్తూ ఉండిపోయింది . కొంతకాలం తర్వాత వాళ్ళకి తొమ్మిదిమంది కూతుళ్ళు పుట్టారు . i
🌸కర్దముడు పిల్లలు పుట్టారు . కనుక సన్యాసం తీసుకుని తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతానని చెప్పాడు
🌿దేవహూతి ఆడపిల్లలు
పెళ్ళిళ్ళయి అత్తవారీళ్ళకు వెళ్ళేవరకు తనకు ఒక కొడుకు పుట్టేవరకు ఉండమని భర్తని వేడుకుంది .
🌸 కర్దముడు కొడుకు కావాలంటే విష్ణుమూర్తిని ధ్యానం చెయ్యమని చెప్పాడు .
🌿కొంతకాలం తర్వాత దేవహూతికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టాడు .
🌸అతనికి కపిలుడు అని నామకరణం చేశారు . మరీచి మొదలయిన మునులతో కలిసి వచ్చి కపిలుడు దేవదేవుడని లోకాల్ని ఉద్ధరించడానికే పుట్టాడని
🌿మరీచిని అక్కడే వుంచి కర్దముడి కూతుళ్ళకు మునులనే ఇచ్చి పెళ్ళి చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మ .
🌸బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే కర్దముడు తన తొమ్మిదిమంది కూతుళ్ళకు మునులతో వైభవంగా పెళ్ళి చేశాడు . కపిలుణ్ణి కనిపెట్టుకుని దేవహూతీ కర్దములు ఉండిపోయారు .
🌿 కొంతకాలం గడిచాక కర్దముడు దేవదేవుడే తన కొడుకుగా ఇంట్లో ఉన్నాడని కొడుకయిన కపిలుడికి నమస్కారం చేసి స్వామి !
🌸 ఆదివిష్ణువయిన నువ్వే నా ఇంట్లో పుట్టావు . నేను చాలా అదృష్టవంతుణ్ణి . నా మనస్సు నీలోనే లగ్నం చేసి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కర్దముడు.
🌿కపిలుడు నేను నీకు మాట ఇచ్చినట్లే నీకు కొడుకుగా పుట్టాను . మునులందరికి తత్త్వజ్ఞానం గురించి చెప్తాను .
🌸నువ్వు కూడ కోరికలు వదిలేసి భక్తి కలిగి నన్ను మనస్సులో తలచుకుంటూ మోక్షాన్ని పొందు అని చెప్పాడు .
🌿కర్దముడు కపిల మహర్షికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆశ్రమానికి వెళ్ళి పరబ్రహ్మని మనస్సులో నిలుపుకుని లోకమంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని
🌸కర్దమ ప్రజాపతి ఆ జన్మాంతం శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ మోక్షాన్ని పొందుతాడు. ఇదండీ కర్దమ ప్రజాపతి చరిత్ర.
🌿రేపు మరో మహర్షి చరిత్ర విశేషాలు తెలుసుకుందాము స్వస్తి
No comments:
Post a Comment