42వ దేవద్యుతి మహర్షి గురించి తెలుసుకుందాం
🌿దేవద్యుతి మహర్షి గురించి చదువుదాం పూర్వం సరస్వతీనదీ తీరంలో యక్షప్రగ్రుణ అనే పేరుతో ఒక పర్వతం ఉండేది .
🌸అక్కడ చక్కటి పుణ్యాశ్రమాలున్నాయి . అక్కడ సుమిత్రుడనే ఋషి కుమారుడు దేవద్యుతి తపస్సు చేసుకుంటున్నాడు .
🌿అతడు మండువేసవిలో పంచాగ్నిలోను , శీతాకాలంలో నీళ్ళలోను నిలబడి ,
🌸గాలి నీరు కందమూలాలు తిని కాలక్షేపం చేస్తూ కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు .
🌿అతని తపస్సు ప్రభావానికి అతని తేజస్సు మూడు లోకాల్లోనూ వ్యాపించింది .
🌸 దేవద్యుతుడి తపస్సుకి ముని సంఘాలన్నీ తల్లడిల్లిపోయాయి .
ఆ ఋషి ఎప్పుడూ
🌿పురుష సూక్తి విధానంలో రోజూ
మంచి పువ్వులో పూజ చేస్తుండేవాడు .
షోడషోపచారాలో పూజ చేస్తున్న దేవద్యుతికి
🌸 వైశాఖ శుద్ధ ఏకాదశినాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు . వెంటనే దేవద్యుతుడు సాష్టాంగ ప్రణామం చేసి స్తోత్రం చేశాడు .
🌿వాసుదేవా ! సురాంతకా ! వనజనాభా ! భక్తవత్సలా ! కృష్ణా ! కృపాసముద్రా ! శ్రీహరా ! జగన్మయా !
🌸నన్ను దయచూడు . పరతత్త్వం నువ్వే . నీవు నిర్గుణుడవు , శుద్ధ బుద్ధాత్ముడవు , చిన్మయుడవు నువ్వు నన్నెప్పుడు కాపాడు తండ్రీ ! అని వేడుకున్నాడు .
🌿దేవద్యుతి విష్ణుమూర్తిని చేసిన స్తుతిని ' యోగసారస్తుతి 'అంటారు .
🌸అది విని విష్ణుమూర్తి దేవద్యుతుణ్ణి కరుణించి అదృశ్యమయ్యాడు .
🌿హరి కృప పొందిన దేవద్యుతుడు పిశాచి రూపంతో బాధపడుతున్న చిత్రసేనుడనే వాడిని
🌸 ప్రయాగ స్నానం చేయించి పిశాచి జన్మ పోయేలా చేశాడు . ఇద దేవద్యుతి కథ !!
🌿ఇదండీ దేవద్యుతి మహర్షి గురించి మనకు అందిన సమాచారం స్వస్తి.
No comments:
Post a Comment