44 వ నరనారాయణ మహరులు గురించి తెలుసుకుందాం
🌿ఈ నరనారాయణ మహర్షులు జంట కవుల్లాగ జంట ఋషులు , కవలలు కూడా .
🌸విష్ణువే రెండు రూపాలుగా పుట్టడం వల్ల వీళ్ళిద్దరెప్పుడూ స్నేహంగా వుంటూ బదరికావనంలో తపస్సు చేసుకుంటూండేవారు .
🌿వెయ్యి సంవత్సరాలుగా ఇలాగే తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి వీళ్ళని చూసి , ఈర్ష్య వచ్చింది .
🌸ఇంకేముంది ఇంద్రుడు నరనారాయణుల తపస్సు భంగం చెయ్యడానికి సింహాలు , పులులు , తోడేళ్ళు , అన్ని రకాల జంతువుల్ని పంపాడు .
🌿అయినా వాళ్ళు కాస్త కూడా కదల్లేదు . అప్సరసల్నిచ్చి మన్మథుడ్ని వెళ్ళమన్నాడు . అమ్మో ! వాళ్ళతో నేను పెట్టుకోనన్నాడు మన్మథుడు .
🌸ఇంద్రుడు బ్రతిమాలుకుని మన్మథుడితో సరే ననిపించాడు . అప్సరసలు , మన్మథుడు బదరికావనంలో అడుగు పెట్టగానే వసంతఋతువు వచ్చినట్లయి కోయిలలు కూయడం మొదలుపెట్టాయి .
🌿చల్లటి గాలి వీచడం , అప్సరసల పాటలు ఆటలు వినిపించడం వలన నరనారాయణులు కళ్ళు తెరిచి చూస్తే పదహారువేలమంది అప్సరసలు మన్మథుడితో సహా కనిపించారు .
🌸 మీరంతా అలసిపోయి నట్లున్నారు మీకు విందు ఏర్పాటు చేస్తామని నారాయణుడు కుడి తొడమీద కొట్టగానే “ ఊర్వశి చెలికత్తెలతో వచ్చింది . వాళ్ళ అందం చూసి అప్సరసలు సిగ్గుపడిపోయారు.
🌿సేవ చేసుకుంటాం మేం వెళ్ళమన్నారు అప్సరసలు . నారాయణుడు ఏదయినా కోరుకోండి ఇస్తానన్నాడు .
🌸దొరికింది అవకాశమని మీరు మాకు భర్తగా కావాలన్నారు . అప్సరసలు అయితే ద్వాపరయుగంలో నేను కృష్ణుడిగా పుడతాను మీరు రాజకన్యలుగా పుట్టి నన్ను చేసుకుందురుగాని ,
🌿ఇప్పటికి మీరొచ్చిన చోటికి వెళ్ళిపొండని పంపించాడు .
ఇంద్రుడు ఇంకచేసేదేమీ లేక ఊర్వశిని చెలికత్తెలని తనతో తీసికెళ్ళాడు .
🌸ఒకసారి ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేస్తూండగా సరస్వతీ నదీతీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద చాలా బాణాలు , ఆ చెట్టు కింద ఆ ఇద్దరు ఋషులు కనిపించారు .
🌿వాళ్ళని చూసి ప్రహ్లాదుడు అయ్యా ! ఈ దొంగ జపమెందుకు ? ఒక ప్రక్క జపం , ఒక ప్రక్క బాణాలు . ఇది ధర్మం కాదు కదా ! అన్నాడు .
🌸ఋషులు నీకెందుకయ్యా ! మేం బ్రాహ్మాణ్యంలోనూ , క్షాత్రంలోనూ కూడ గొప్పవాళ్ళం అన్నారు .
🌿ప్రహ్లాదుడు బాణాలంటే మీకు చులకనగా వుందా ? ఏదీ నాతో యుద్ధం చెయ్యండనగానే నరుడు లేచి విల్లెక్కుపెట్టి యుద్ధానికి దిగాడు .
🌸ఇలా వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు . శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రహ్లాదా వీళ్ళతో పెట్టుకోకు . వీళ్ళు నా వాళ్ళు , స్నేహంగా వుండమని చెప్పి వెళ్ళిపోయాడు .
🌿నరనారాయణులు కూడా మేం నీతో సరదాగా యుద్ధంచేశాం . నీ మీద మాకు శత్రుత్వం లేదని చెప్పి పంపేశారు .
🌸పూర్వం సహస్రకవచుడనే రాక్షసుడుండేవాడు . వాడికి పుడుతూనే వెయ్యి కవచాలు .
🌿వాడు లోకంలో ఎవ్వరినీ బ్రతకనియ్యడం లేదు . వాణ్ణి ఎలాగయినా చంపాలని నరనారాయణులు ఒకళ్ళు యుద్ధం చెయ్యడం ,
🌸ఒకళ్ళు తపస్సు చెయ్యడం ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాడితో యుద్ధం చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలూడగొట్టారు .
🌿వాడికింక టైమయిపోయి చచ్చిపోయి కర్ణుడుగా ఒంటి కవచంతో పుట్టాడు . నరనారాయణులు కూడా అర్జనుడు , కృష్ణుడుగా పుట్టి కర్ణుణ్ణి చంపారు .
🌸కొంతకాలం తర్వాత నారదుడు బదరికావనానికి వచ్చి నరనారాయణులకి పూజచేసి మహాత్మా ! సిద్ధి పొందడానికి ఏంచెయ్యాలి ? అనడిగాడు .
🌿నారదా ! ధ్రువము , అచలము , ఇంద్రియగోచరము , సూక్ష్మము అయి సర్వానికి అంతరాత్మ అయి వెలుగుతున్న తత్వాన్నే ఆరాధించు అన్నారు నరనారాయణులు .
🌸నారదుడు అసలు మూలకృతి ఎలా ఉంటుందో చెప్పండన్నాడు . అది తెలుసుకోవాలంటే నువ్వింకా ధ్యానం చెయ్యాలి .
🌿ఇప్పుడు నీకు చెప్పినా తెలియదన్నారు నరనారాయణులు . నారదుడు పాలసముద్రానికి ఉత్తరం వైపున శ్వేతపర్వతం మీద చాలామంది
🌸తపస్సుచేసుకుంటుంటే తనుకూడ అక్కడ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు .
🌿విష్ణుమూర్తి నారదుడికి తత్త్వాన్ని గురించి చెప్పి వెళ్ళిపోయాడు . నారదుడు జరిగిందంతా నరనారాయణులకి చెప్పాడు .
🌸నువ్వు పుణ్యాత్ముడివి అక్కడ జరిగినదంతా ఇక్కడ మేం చూశాం . ఒంటరిగా వుండి విష్ణువుని ధ్యానించమని చెప్పారు నరనారాయణులు .
🌿విశాలుడనే రాజు శత్రువుల వల్ల రాజ్యం పోయి విష్ణువుని గురించి తపస్సు చేస్తుంటే నరనారాయణులు అక్కడికి వెళ్ళి రాజా నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు .
🌸విశాలుడు నాకు విష్ణుమూర్తి తప్ప ఇంకెవరు ఏమీ ఇవ్వలేరన్నాడు . రాజా ! విష్ణుమూర్తె మమ్మల్ని పంపించాడు . నీకేం కావాలి ? అన్నారు నరనారాయణులు .
🌿విష్ణుమూర్తికి ఇష్టమయిన యాగాలు చెయ్యడానికి సరిపడ సంపద కావాలన్నాడు రాజు .
🌸అయితే కల్కిభగవానుడి గురించి తపస్సు చెయ్యి . కల్కివ్రతం చెయ్యి అని చెప్పారు . విశాలుడు కల్కి వ్రతం చేసి సంపదల్ని పొంది విష్ణుమూర్తికి ఇష్టమయిన యాగాలు చేసి ముక్తి పొందాడు .
🌿శౌనక మహర్షి నాలుగు వేదాలు , వాటి అర్థాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు .
🌸ఒకసారి శిష్యులతో పాటుగా తిరుగుతూ మనోహరంగా వున్నదీ , రకరకాల యోగులతో , హరిభక్తులతో , వనదేవతలతో , మునికన్యలతో
🌿అందంగానూ , అన్ని పుణ్యాలకి నిలయంగానూ , పవిత్రంగానూ ఉన్న నరనారాయణుల ఆశ్రమానికి వచ్చాడు శౌనక మహర్షి నారాయణుడు శౌనక మహర్షిని చూసి ఏం కావాలి అని అడిగాడు .
🌸శౌనకుడు నారాయణుడికి నమస్కారం చేసి దేవా ! నేను సర్వ వేదశాస్త్రాలు చదివాను . కానీ వాటి లోతైన అర్ధాలు తెలియడం లేదన్నాడు .
🌿నారాయణుడు నారదుడికి చెప్పినట్లే వేదసారమైన విష్ణువుని గురించి చెప్పి హరిభక్తి తప్ప ఇంక ఏ ఉపాయం లేదని చెప్పాడు .
🌸శౌనకుడు నారదుడి జన్మవృత్తాంతం చెప్పమన్నాడు . నారదుడు పుట్టిన దగ్గర్నుంచి విష్ణుభక్తుడయ్యేవరకు నారాయణుడు శౌనకుడికి చెప్పాడు .
🌿వేదాల్ని చదివే అధికారం లేనివాడు ముఖ్యంగా చెయ్యాల్సిన పనులేమిటని శౌనకుడు అడిగాడు .
🌸అలాంటి వాళ్ళు దానధర్మాలు , సత్యం పలకడం , బావులు , చెఱువులు లాంటివి త్రవ్వించడం , కొడుకుని పొందడం ,
🌿బ్రాహ్మణ పిల్లలకి ఉపనయనానికి , పెళ్ళిళ్ళకి సాయపడడం , స్వంతధనంతో బ్రాహ్మణులని రక్షించడం ,
🌸బ్రాహ్మణుడికి ఇల్లు కట్టించివ్వడం ఇలాంటివి విష్ణువు దగ్గరకు చేరే మార్గాలు అని చెప్పాడు నారాయణనుడు .
🌿ఉత్తముడైన కవియొక్క ఉత్తమమైన గ్రంథాన్ని తీసుకున్న ఉత్తముడికి పుణ్యలోకం కలుగుతుంది .
🌸శౌనక మహర్షీ ! ఇవన్నీ ఎందుకు ? విష్ణువే ధర్మం , గతి , శాశ్వతుడు . హరిభక్తి కంటే మించింది లేదని చెప్పాడు నారాయణుడు .
🌿శౌనకుడు నరనారాయణులు చెప్పింది విని ఆనందంతో తన ఆశ్రమానికి వెళ్ళాడు .
🌸ఇదీ నరనారాయణ మహర్షుల కథ !! భగవంతుడు తన గురించి తెలియపర్చి , ఎలా పుణ్యలోకాలు చేరుకోవాలో తెలియని వాళ్ళకి తనే మనిషిగా పుట్టి తెలియచెప్పాడు .
🌿నరనారాయణుడంటే విష్ణుమూర్తి కదా .. మనం కూడా అదృష్టవంతులమే ఈ కథ చదవడం వల్ల ..
🌸ఇదండీ నర నారాయణ మహర్షుల చరిత్ర .. స్వస్తి..

No comments:
Post a Comment