Adsense

Wednesday, October 26, 2022

7వ మహర్షి అష్టావక్ర మహర్షి (ashtavakra maharshi)

 మన మహర్షుల చరిత్ర...!!

ఈ రోజు 7వ మహర్షి అష్టావక్ర మహర్షి గురించి తెలుసుకుందాంము ...!!



🌿ఈ అష్టావక్ర మహర్షి తల్లి కడుపులో ఉండగానే అన్ని వేదాలు , మంచి చెడు అన్నీ తెలిసేసుకున్నాడు .

🌸ఈయన తల్లి పేరు సుజాత . తండ్రి ఏకపాదుడు అనే తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు .

🌿అసలు అష్ట అంటే మీకు తెలుసా ?
ఎనిమిది అని అర్థం . వక్రుడు అంటే తెలుసా ? వంకరలు కలవాడు అని అర్థం .

🌸ఈ ఎనిమిది వంకర్లు అష్టావక్ర మహర్షికి ఎలా వచ్చాయో తెలుసా ... ఈయన తల్లి కడుపులోంచే వేదాలన్నీ వినేస్తూ ఉండేవాడు .

🌿ఒకసారి తండ్రి పిల్లలకి పాఠాలు చెప్తూ తప్పు చెప్పాడు . అష్టావక్రుడు నాన్నగారూ ! మీరు తప్పు చెప్పారు అని సరిగా ఎలా చెప్పాలో చూడా చెప్పాడు .

🌸అంతే తండ్రికి కోపం వచ్చి నువ్వు ఇప్పుడే నన్ను తప్పులు పట్టుకుంటున్నాను .

🌿రేపు నువ్వు బయటకు వస్తే ఇంకా ఏమేం చేస్తావో ! నువ్వు అష్టావక్రుడుగా అంటే ఎనిమిది వంకర్లతో పుట్టమని శపించాడు .

🌸అష్టావక్రుడికి ఆ పేరు పాపం పుట్టకుండానే శాపం వచ్చింది . అది .. కన్న తండ్రి నుంచి వచ్చింది .

🌿ఒకనాడు సుజాత ఏకపాదుడిని చక్రవర్తిగారి దగ్గరికి వెళ్ళి కొంచెం ధనం తీసుకురమ్మంది . అప్పుడు ఏకపాదుడు జనక చక్రవర్తిగారి దగ్గరికి వెళ్ళాడు . నందితో వాదించి గెలిస్తే ధనం ఇస్తాను ,

🌸ఓడిపోతే ఇక్కడే నీళ్లల్లో ముంచేస్తాను అన్నారు చక్రవర్తిగారు . ఏకపాదుడు ఓడిపోయి నీళ్లల్లో ఉండిపోయాడు . ఇక్కడ మన అష్టావక్రుడు ఎనిమిది వంకర్లతో పుట్టేశాడు .

🌿అదే సమయంలో అష్టావక్రుడికి శ్వేతకేతుడు అనే పేరుతో మేనమామ పుట్టాడు . ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు .

🌸కోంతకాలం తర్వాత అష్టావక్రుడు తండ్రికి జరిగిన అవమానం తెలిసి నందితో వాదించడానికి మేనమామతో కలిసి బయలుదేరాడు .

🌿చక్రవర్తిగారు అష్టావక్రుడిని చూసి " నువ్వు చిన్నవాడివి , నందితో వాదించలేవు ” అన్నారు . అందుకు అష్టావక్రుడు ముందు జనకమహారాజుతో వాదించి గెలిచి , తర్వాత నందితో వాదించి గెలిచి తండ్రిని రక్షించాడు .

🌸 అష్టావక్రుడి తండ్రి సంతోషించి వంకరలన్నీ పోయి అందంగా తయారవమని దీవించాడు . అంతే ! మన అష్టావక్ర మహర్షి గారు చాలా అందంగా మారిపోయారు . 

🌿జనకమహారాజు గారు అష్టావక్రుడితో నువ్వు అద్వైత వేదాంత రహస్యాలన్నీ నాకు చెప్పావు . ఇది ' అష్టావక్ర సంహిత ' అనే పేరుతో కావ్యంగా వస్తుందని చెప్పి అష్టావక్రుడిని సన్మానించి

🌸చిన్నవాడు కదా .. దీవించి పంపారు . ఒకనాడు తండ్రి ఏకపాదుడు కొడుకుని పిలిచి నాయనా ! సదాన్య మహర్షికి సుప్రభ అనే అమ్మాయి ఉంది .

🌿నువ్వు పెళ్ళి చేసుకో అని చెప్పాడు . అష్టావక్రుడు సదాన్య మహర్షిని మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి అని అడిగాడు . అప్పుడు సదాన్యుడు అష్టావక్రా ! నువ్వు చాలా మంచివాడివే కానీ , నా కూతుర్ని పెళ్ళి చేసుకోవాలంటే ఒక షరతు ఉంది .

🌸అది ఏమిటో చెప్తాను వినమని ఇలా చెప్పాడు . ఉత్తర దిక్కుకి వెడితే కుబేరుడి నగరం వస్తుంది . అది దాటి హిమవత్పర్వతం మీద ఉన్న పార్వతి పరమేశ్వరులని పూజించు ,

🌿 మళ్ళీ ఉత్తర దిక్కు వైపే వెళ్ళు . అక్కడ పెద్ద పువ్వులతోట వస్తుంది . అందులో నగరం వుంది . దాన్ని పాలిస్తున్న రాణిగారి ఆశీర్వాదం కూడా తీసుకునిరా !

🌸నా కూతుర్నిచ్చి అపుడు పెళ్ళి చేస్తాను అన్నాడు సదాన్యుడు . దానికి అష్టావక్రుడు సరేనని తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరి వెళ్ళి సదాన్య మహర్షి చెప్పినట్లే అన్నీ చేసి వచ్చాడు . 

🌿సదాన్య మహర్షి సుప్రభనిచ్చి పెళ్ళి చేశాడు . బ్రహ్మర్షులు ఆశీర్వదించారు . దేవతలు పూలవాన కురింపించారు . అష్టావక్ర మహర్షి పిల్లలు కలిగిన తర్వాత తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు .

🌸 రంభ మొదలయిన అప్సరసలు వచ్చి వాళ్ల నాట్యం చూపించి విష్ణుమూర్తి భార్యలుగా ఉండాలని ఉందని వరం అడిగారు అష్టావక్రుణ్ణి .

🌿 మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పాడు అష్టావక్రుడు . కృష్ణావతారంలో గోపికలు లేరూ ... వాళ్ళే వీళ్ళు .

🌸సగరుడు అనే మహారాజు కొడుకులు కపిల మహర్షి శాపంతో భస్మమయిపోయారు . వారి భార్యలు విష్ణుమూర్తిని ఆరాధించి భగీరథుడు అనే కొడుకుని పొందారు .

🌿ఈ భగీరథుడు . చాలా బలహీనంగా ఉండేవాడు . భగీరథుడు బలంగా వుండేలా చేసి , గంగానదిని భూలోకానికి తీసుకురాగల శక్తిని కూడ ప్రసాదించాడు అష్టావక్రుడు.

🌸అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకనాడు బృందావనంలో ఉన్న కృష్ణుడిని చేరి స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గర ప్రాణాలు విడిచాడు .

🌿ఆయన దేహానికి అంత్యక్రియలు శ్రీకృష్ణపరమాత్ముడే చేశాడు . ఎంత అదృష్టవంతుడో కదూ ...

🌸అష్టావక్ర మహర్షి పూర్వజన్మ గురించి శ్రీకృష్ణుడు అక్కడ వున్న అందరికీ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు .

🌿 విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మ తన మనస్సు నుంచి కొంతమంది పిల్లల్ని పుట్టించి సృష్టి చెయ్యడానికి సాయపడమని వాళ్ళని అడిగాడు .
🌸అందులో ప్రచేతనుడికి అసితుడనే వాడు పుట్టి గొప్ప విష్ణుభక్తుడయ్యాడు . అసితుడు పెరిగి పెద్దవాడయి పెళ్ళి చేసుకున్నాడు .

🌿 కానీ అతడికి పిల్లలు కలగకపోతే ఈశ్వరుడు రాధామంత్రం జపించమన్నాడు . ఆయన జపం భగ్నం చెయ్యాలని ఇంద్రుడి మాటతో రంభ ప్రయత్నించి వీలు గాక

🌸అసితుణ్ణి శపించింది . ఆయనే మన అష్టావక్ర మహర్షి , ఆయనచేత చెప్పబడిన ' అష్టావక్ర సంహిత ' . రోజూ పారాయణ చేస్తే

🌿చాలా పుణ్యం , సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని చేత్తోనే అంత్యక్రియలు జరిపించుకున్న అష్టావక్రుడు ఎంత గొప్ప మహరో అర్థమయింది కదా ,

🌸 చూశారా ! మన అష్టావక్ర మహర్షి వంకర్లు లేకుండా అందంగా అవడమే కాకుండా ఎంతోమందికి సహాయం చేసి అన్ని శాపాల్ని దాటుకుని చివరికి

🌿 భగవంతుడైన శ్రీ మహావిష్ణువు పాదాల మీద ప్రాణాలు విడిచాడు .
ఆహా ఎవరికి దక్కుతుంది . ఇంత అదృష్టం !

🌸ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది.

🌿శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది.

No comments: