🌸భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా..!? ఎవరైనా శతృవుకి భయపడతారు. కానీ భక్తుడికి భయపడడమా..!?
🌿అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా? అదెలా జరగింది, ఎక్కడ జరగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ?
🌸ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరు లో జమ్మూ నగరానికి 110 కి.మీ. దూరంలో, ‘రియాసి‘ జిల్లాలలో వున్న ‘రంసూ‘ గ్రామానికి సుమారు 3 లేక 4 కిమీ కొండదారిలో నడిచి వెళ్తే యీ గుహాలయం చేరుకోవచ్చు.
🌿కశ్మీర్ లో ‘ఖోరి‘ అంటే గుహ అని అర్ధం. శివఖోరి అంటే శివుడు వున్న గుహ అని అర్ధం. జమ్మూ నుంచి యీ గుహాలయం చేరుకోడానికి రెండు దారులు వున్నాయి. మొదటిది అష్ఠాదశ శక్తిపీఠాలలో ముఖ్యమైన వైష్ణవీ దేవి గుడికి ట్రెక్ మొదలయ్యే కట్రా టౌన్ మీదుగా, రెండవది జమ్మూ అఖ్నూర్‘ మీదుగా ‘రాజోరి‘ వెళ్ళే దారిలో ‘ఖండా మోర్హా‘ జంక్షన్ నుంచి 6 కి.మీ. ప్రయాణం చేస్తే ‘రంసూ‘ గ్రామం చేరుకోవచ్చు.
🌸వైష్ణవీ దేవి కోవెల ట్రష్టు వారు యీ కోవెల మేనేజ్ మెంటు కుడా తీసుకుని రోడ్డు, భోజన సదుపాయ వసతులు యాత్రికులకు అందుబాటులోకి తెస్తున్నారు. వైష్ణవీ దేవి యాత్రీకులు యీ గుహాలయాన్ని కుడా దర్శించుకోవచ్చు.
🌿`కట్ర‘ బస్ స్టాండు నుంచి బస్సు, టాక్సీ సదుపాయాలు వున్నాయి. ‘కట్ర‘ నుంచి ‘రంసూ‘ కి 70 కిమీ ఘాట్ రోడ్డు ప్రయాణం. కొండల మీంచి దూకుతూ ప్రవహించే సెలయేళ్లు వో పక్క , కిందుగా లోయలో గలగలా ప్రవహించే నదులు మరో పక్క, ఉన్నతంగా మాకెవ్వరూ సాటిరారు అన్నట్లు ఉన్న ఎత్తైన పర్వతాలు చూడటానికి ఎంతో బాగుంటాయి.
🌸రంసూ కూడా చిన్న గ్రామం. అక్కడ నుంచి గుహ వరకు నడక దారి. మెట్లు ఎక్కి గుహ లోపలకి చేరుకోవాలి. గుహ లోపల సుమారు 300 మంది పట్టేంత పెద్దదిగా వుంటుంది. అక్కడ నుంచి లోపలికి మోకాళ్ల పైన పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది.
🌿కొన్ని చోట్ల పొట్ట నేలకు ఆనించి పాక వలసి వుంటుంది. అలా పాక్కుంటూ వెళ్లాక నిలబడ గలిగేంత వెడల్పు అవుతుంది గుహ. ఇక అక్కడంతా అద్భుతమే పార్వతి , వినాయకుడు, నారదుడు, శివుని ఝటా ఝూటం, పద్మం యిలా దేవీ దేవతా మూర్తులు ప్రాకృతికంగా యేర్పడ్డాయి.
🌸వాటిని చూస్తువుంటే మనలో భక్తి పారవశ్యం కలుగక మానదు. తలెత్తి పైన వున్న కొండని అంటే చెయ్యెత్తితే అందేంత యెత్తులో వుంటుంది. అక్కడ మరింత అధ్బుతంగా యేర్పడ్డ ఆది శేషుని చూడోచ్చు. లోపల కొంత దూరం వెళ్ళాక దారి రెండుగా చీలుతుంది.
🌿200 మీటర్ల పొడవు, 3 మీటర్ల యెత్తు, ఒక మీటరు వెడల్పు వున్న ఈ గుహలోకి శ్వాస సంబంధ రుగ్మతలు వున్నవాళ్ళు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకు వెళ్లాలనేది డాక్టర్ల సలహా.
🌸లోపల నాలుగు అడుగుల యెత్తున్న స్వయంభూ శివలింగం. నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తూ పాల రంగులో వుండే జల వూట. ఈ గుహకు సంబంధించిన కథ.
🌿పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు, పరమ శివభక్తుడు, దేవతలపై విజయం సాధించాలనే కోరికతో తనకి మరణం లేకుండా వుండేటట్లు వరం పొందాలని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపశ్శక్తి కి ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగేయి.
🌸ఆ ప్రకంపనలు శివ నివాసమైన కైలాసాన్ని కుడా కుదిపేశాయి. శివుడు భస్మాసురుని తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమై ..
🌿 “వత్సా ! ఏమి నీ కోరిక” అని అడుగగా,
🌸 “ పరమేశ్వరా ! నాకు మృత్యువు లేకుండునట్లు వరమిమ్ము” అన్నాడు భస్మాసురుడు.
🌿అంత శివుడు ‘మరణం లేకుండా ఉండేటట్లు వరమిచ్చుటకు తాను ఆశక్తుడనని మరేదైనా వరం కోరుకోమని’ అంటాడు. దానికి భస్మాసురుడు తాను యెవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అయేటట్లు వరం అనుగ్రహించమంటాడు. శివుడు భస్మాసురుని కోరిక తీరుస్తాడు.
🌸భస్మాసురుడు శివుడు యిచ్చిన వరప్రభావాన్ని శివుడి పైనే ప్రయోగించి చూడాలనే తలంపుతో శివుడి తలపై చెయ్యపెట్టడానికి వెంట పడతాడు. దాంతో తప్పించుకొని పారిపోతూ విష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు శివుడు.
🌿భస్మాసురుడు శివుడిని తరుముతూ వుంటాడు. మూర్ఖులకు వినాశ కారకమైన వరాలు అనుగ్రహించ కూడదు అని తెలుసుకొన్న శివుడు యీ గుహలో దాక్కుంటాడు. శివుడిని తరుముతూ గుహ వైపు వస్తున్న భస్మాసురుడిని మోహినీ రూపం లో వున్న విష్ణుమూర్తి అడ్డుకుంటాడు.
🌸మోహినీ రూపానికి ఆకర్షితుడైన భస్మాసురుడు తనను పెండ్లాడమని మోహినిని కోరుతాడు. దానికి మోహిని తనతో సమానముగా నర్తించిన వారినే తాను పరిణయమాడుతా నని అంటుంది. అందుకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని నర్తించి నట్లే నర్తించి తన వర ప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ తన తలపైన చెయ్యిపెట్టుకొని భస్మమౌతాడు.
🌿ఇలా శివుడు ఆ భీభత్స భక్తుడికి భయపడి దాక్కున్న గుహే ఈ శివఖోరీ గుహ. కాలాంతరాన ఒక గొర్రెల కాపరి తప్పి పోయిన గొర్రెను వెదుకుతూ యీ గుహలోకి వచ్చి యిక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులను చూచి అతను కూడా శివభక్తుడిగా మారి,
🌸అక్కడే వుండి తపస్సు చేసుకుంటూ ఆ గుహలోనే వుండిపోయి కొన్నేళ్ళ తరువా త యింటి పైకి మనసు పోగా తపస్సు చాలించి యింటికి వెళ్లదలుచు కుంటాడు.
🌿అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులు శివుడు స్వయంభువుగా వున్న యీ ప్రదేశం గురించి ఎవరికి తెలియ నివ్వవద్దని మాట తీసుకుంటారు. మాట మీరితే అతనికి మరణం సంభవిస్తుందని చెప్పారు.
🌸ఈ కాపరి పుట్టుకతో ముస్లిం. అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని ఇంటి వారు కారణం అడుగగా, శివ దర్శనం అయినట్లు మాత్రమే చెప్పాడు.
🌿పశువుల కాపరి బంధువులు తాము కూడా శివదర్శనం చేసుకుంటామని ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకు పొమ్మని వత్తిడి తేగా, వారి వత్తిడికి తలవొగ్గి కాపరి వారిని గుహవద్దకు తీసుకొని వెళ్లాడు.
🌸మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణించాడు. ఈ గుహనుండి గుహదారి అమర్ నాథ్ గుహకి కలిసి ఉంటుందని, అషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణిమ వరకు జరిగే అమర్ నాథ్ యాత్ర సమయం లో అమర్ నాథ్ గుహలో పుజలందుకొనే శివుడు మిగతా సమయంలో యీ గుహలో యోగ సమాధి లో వుంటాడని స్థానికుల నమ్మకం.
🌿అందుకే యీ క్షేత్రాన్ని ”బూఢా అమర్నాథ్” అని కూడా పిలుస్తారు. అమర్ నాధ్ లో లాగే యిక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం...స్వస్తి
🌸ఈ కాపరి పుట్టుకతో ముస్లిం. అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని ఇంటి వారు కారణం అడుగగా, శివ దర్శనం అయినట్లు మాత్రమే చెప్పాడు.
🌿పశువుల కాపరి బంధువులు తాము కూడా శివదర్శనం చేసుకుంటామని ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకు పొమ్మని వత్తిడి తేగా, వారి వత్తిడికి తలవొగ్గి కాపరి వారిని గుహవద్దకు తీసుకొని వెళ్లాడు.
🌸మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణించాడు. ఈ గుహనుండి గుహదారి అమర్ నాథ్ గుహకి కలిసి ఉంటుందని, అషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణిమ వరకు జరిగే అమర్ నాథ్ యాత్ర సమయం లో అమర్ నాథ్ గుహలో పుజలందుకొనే శివుడు మిగతా సమయంలో యీ గుహలో యోగ సమాధి లో వుంటాడని స్థానికుల నమ్మకం.
🌿అందుకే యీ క్షేత్రాన్ని ”బూఢా అమర్నాథ్” అని కూడా పిలుస్తారు. అమర్ నాధ్ లో లాగే యిక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం...స్వస్తి
No comments:
Post a Comment