THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, October 4, 2022
దుర్గాష్టమి విశిష్టత....!!
🌸ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం.
🌿ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు.
తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.
🌸ఈ ఏడాది దుర్గాష్టమి అక్టోబరు 3న వచ్చింది.
అష్టమి తిథి: అక్టోబరు 2 ఆదివారం సాయంత్రం 6.28కి ప్రారంభమై... అక్టోబరు 3 సోమవారం సాయంత్రం 4.50 వరకూ ఉంది. సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి...దుర్గాష్టమి అక్టోబరు 3 సోమవారం జరుపుకుంటారు.
🌿దుర్గాదేవీ "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతీ వచ్చిందని చెబుతారు.
🌸ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలిగించేది దుర్గ. దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని ఒక నామం ఉంది.
🌿గత జన్మలలో వాసనల వల్ల ఈ జన్మలో దుష్ట విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆ తల్లిని ఉపాసిస్తే గురుమండల రూపిణి అయి, గురు రూపంలో దగ్గరకు వచ్చి తన శక్తిమంతమైన వాక్కులతో గత జన్మ వాసన దూరంచేసి...దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది.
🌸నిత్యం 'దుర్గా' అనే నామాన్ని ఎవరు స్మరిస్తారో వారు సద్గతి వైపు ప్రయాణం చేస్తారు.‘దుర్గా’ అంటే దుంఖం దూరమవుతుంది. దుర్గా ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షసుల బాధలు దరిచేరవు .
🌿అందువల్లనే మొదటి మూడురోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతీ రూపాన్ని ఆరాదించి జ్ఞానాన్ని పొందవచ్చంటారు పెద్దలు.
🌸దుర్గాష్టమి రోజు దుర్గా అష్టోత్తరం, దుర్గా సహస్రనామం పారాయణం చేస్తారు.
🌿పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టుపై ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు.
🌸శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. అందుకే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.
🌿దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.
🌸దుర్గాష్టమి రోజు శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు..స్వస్తి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment