THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే..!!
🌿విష్ణుమూర్తి కుర్మావతార రూపములో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు.
🌸అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి.
🌿అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది.
🌸ఆమె లక్ష్మీదేవి, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది.
🌿అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది.
🌸సర్వలోకరక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది.
🌿సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగు బంగారమవుతుంది.
🌸లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు.
🌿ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.
🌷 మహా లక్ష్మీష్టకం స్తోత్రం..🌷
ఇంద్ర ఉవాచ -
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం ।
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
ఇంత్యకృత శ్రీ మహా లక్ష్మీష్టకం స్తోత్రం సంపూర్ణం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment