Adsense

Saturday, October 1, 2022

శ్రీ త్యాగరాజకీర్తన ...!!

 

జగదానంద తారక.... !
జయ జానకీ ప్రాణ నాయక !!
జగదానంద తారక

గగనాధిప సత్కులజ !* *రాజ రాజేశ్వర ! సు-గుణాకర సుర సేవ్య భవ్య దాయక  సదా సకల !!
జగదానంద తారక

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నఘసుర సుర భూజ
దధి పయోధి వాస హరణ
సుందర-తర వదన సుధా-మయ వచో-
బృంద గోవింద సానంద
మా-వరాజరాప్త శుభ కరా !!
జగదానంద తారక

నిగమ నీరజామృతజ
పోషకాని మిష వైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత
వానరాధిప నతాంఘ్రి యుగ
జగదానంద తారక

ఇంద్ర నీల మణి సన్నిభాపఘన
చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర
నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద తారక

సృష్టి స్థిత్యంత కార కామిత
కామిత ఫలదా సమాన గాత్ర శచీ పతి నుతాబ్ధి మద హరానురాగ
రాగ రాజిత కథా సార హిత
జగదానంద తారక

సజ్జన మానసాబ్ధి సుధా-కర
కుసుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణావ-గుణా సుర గణ
మద హరణ సనాతనాజ నుత
జగదానంద తారక

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది
రూప వాసవ రిపు జనకాంతక కలా-
ధర కలా ధరాప్త ఘృణా-కర
శరణాగత జన పాలన సు-మనో
రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద తారక

కర ధృత శర జాలాసుర
మదాప హరణావనీ సుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజ నుత
జగదానంద తారక

పురాణ పురుష నృ-వరాత్మజాశ్రిత
పరాధీన ఖర విరాధ రావణ
వి-రావణా నఘ పరాశర మనో-
హరావికృత త్యాగరాజ సన్నుత
జగదానంద తారక

అగణిత గుణ కనక చేల సాల విదళనారుణాభ సమాన
చరణాపార మహిమాద్భుత సు-కవి జన
హృత్సదన సుర ముని గణ విహిత
కలశ నీర నిధిజా రమణ పాప గజ
నృ-సింహ వర త్యాగరాజాది నుత
జగదానంద తారక

రాగం :- నాటై

తాళం :- ఆధీ

సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ త్యాగరాజ స్వామి

No comments: