నారాయణుడు బ్రహ్మాది దేవతలను తోడ్కొని కైలాసగిరికి వచ్చి ఈశ్వరుని ఎన్నోవిధాలుగా స్తుతించి కీర్తించగా, పరమశివుడు వారి యందు కరుళార్ధ హృదయుకడై, “సృష్టి, స్థితి కారకులైన ఓ బ్రహ్మా విష్ణుమూర్తులారా! దేవతలు భయం వీడి వెళ్ళవచ్చును. మీకు కలిగిన విపత్తును నేను తొలగిస్తాను. ముందు నన్ను పిలువని దక్షియజ్ఞానికి యూ దేవతలు వెళ్ళిన కారణాన యిన్ని కష్టాలు పడుతున్నారు. నా ప్రతి రూపమైన కుమారుడు ఉదయించి శూరపద్మాది రాక్షనులను సంహరించగలడు. అంత వరకు మీ కర్మ పరిపాకమునకు మీరు వ్యధచెందక తప్పదు ” అని చెప్పి అంతర్హితుడాయెను.
దేవతలు కైలానము పదలి వెళ్ళినారు. కానీ వారికి ఒక సంశయము కలుగక పోలేదు. పార్వతీదేవి శిపుని చేరాలని హిమాలయలో ఒకచోట తపమాచరించుచున్నది. మౌన నిష్టలో కైలాస మందిరంలో
శివుడువున్నాడు, వీరికి పరిణయ మైనప్పుడు కదా కుమారుడు ఉదయించగలడు! వీరి వివాహము జరుగునంత వరకు సమస్త జీవరాసులలో కామేచ్చ కలుగదు, మోహమూ, తాపమూ లేని జడత్వం ప్రపంచమంతా ఆవరించియున్నది. స్త్రీ పురుషుల కలయికకు పకృతి పురుషులైన ఆది దంపతుల సమాగమమే కదా మూలము! కావున సాధ్యమైనంత శీఘ్రగతిన, పరమేశ్వరునికి పార్వతీదేవి యందు మాహానురాగాలు కలుగవలె! అందుకు మన్మధుడు పూనుకోవలి! వార నడుమ రాగమతిశయించగానే కుమార సంభవము జరుగవలి! ఆ కుమారుని మూలముగా శూరపద్ముని పీడ తొలగవలె! అంతవరకూ మనము ఈ శూరపద్ముని నుండి తప్పించుకొని తిరగవల! ఇదంతా కర్మ పలితము! శివునికి మన్నన లేనిచోటికి చెళ్ళినాము, కష్టాలను కొని తెచ్చుకొన్నామని” పరి పరి విధాలుగా దేవతలు వగచుచుండిరి.
No comments:
Post a Comment