THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
భౌగోళిక పదాలు
*1)Mountain(పర్వతం)*:--సముద్ర మట్టము నుండి చాలా ఎత్తులో ఉండి అధిక వాలు కలిగిన ఙూభాగాన్ని "పర్వతం"అంటారు. ఉదా:-- హిమాలయాలు.
*(Peak)శిఖరం*:-- పర్వతంలో ఎత్తైన బాగాన్ని "శిఖరం" అంటారు.
*Hill(కొండ)*:--పర్వతం, కొండ ను వేరుగా చెప్పడం కష్టం.అయితే ఆధునిక నిర్వచనం ప్రకారం 900 meter లకు తక్కువ ఎత్తులో ఉన్న భూభాగాన్ని *కొండ*అంటారు. ఉదా:-- పాల కొండలు.
*Hillock (గుట్ట)*:--అతిచిన్న కొండ, ప్రాంతీయ భాషలో చెప్పాలంటృ *గుట్ట*
*Ranges(శ్రేణులు)*:--పర్వతాల వరుసను "శ్రేణి" అంటారు. Ex:--హిమాలయ శ్రేణి
*(Valley)లోయ*:--కొండ/పర్వతం మధ్యగల లోతైన ప్రాంతాలను "లోయ" అంటారు.
*(Dune)డూన్*;--హిమాచల్,శివాలిక్ శ్రేణి మధ్యగల దైర్ఘ్య లోయలను "డూన్"అంటారు. ఉదా:--డెహ్రాడూన్
*(Ghat)కనుమ*:--పర్వతం/కొండల మధ్యగల దారులను *కనుమ* అంటారు. ఉదా:--నాథూలా కనుమ(హిమాలయాలు). తూర్పు కనుమలు.
*lake(సరస్సు)*:--లోతట్టు ప్రాంతంలో నిలువ ఉన్న నీరు. ఒక హెక్టారు కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే "సరస్సు".1 హెక్టారుకు తక్కువగా ఉంటే చెరువు.
ఉదా:--పులికాట్, కొల్లేరు
*(Oasis)ఒయాసిస్*:--ఎడారిలో నీటిబుగ్గచే ఏర్పడిన మడుగు.
*(Altitude)ఎత్తు*:--సముద్రమట్టము నుండి గల ఎత్తు.
*(Glacier)హిమానీనదం*:--మంచు కరిగి నెమ్మదిగా ప్రవహించే నది. గంగోత్రి,లాంబెర్ట్.
*(River)నది*:--పర్వతాలు/కొండలలో పుట్టి సముద్రంలో కలిసేది.
*(Tributory)ఉపనది*:--నదిలో వచ్చి కలిసే సెలయేరు.అలక్ నంద, భగీరధి.
*(Distributory)నదీ విభజన*:--నది నుండి వెలుపలికి ప్రవహించే చిన్ననది. ఉదా:--హుగ్లి(గంగ నుండి).
*(River basin)నదీపరివాహకప్రాంతం*:--నది దాని ఉపనదుల వల్ల నీటి లభ్యత కలిగిన ప్రాంతం. ఉదా:--గోదావరి బేసిన్
*(Riverine)*నదీ:--నదికి ఇరువైపులా గల ప్రాంతం
*(Delta)డెల్టా*:--నది సముద్రంలో కలిసే ముందు పాయలుగా చిలిపోతుంది.ఈ పాయల మధ్య డెల్టా ఆకారంలో ఏర్పడిన సారవంతమైన నెలనే "డెల్టా" అంటారు.
*(Doab)దోఆబ్*:--రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం.
*(Confluence)నదీ సంగమం*:--రెండు (ఉప)నదులు కలిసే చోటు..ఉదా:--దేవప్రయాగ
*(spring)నీటిబుగ్గ:--భూమినుండి సహజసిద్ధంగా పైకి వచ్చే నీటిబుగ్గ.
*Inland drainage*:-- సముద్రాన్ని చేరకుండానే భూమిలో ఇంకిపోయే నది.ఉదా:--లూనీ, మహి
*Gorge గార్జ్*:--కొండ/పర్వతం మధ్యగల ఇరుకైన లోయ. బైసన్ గార్జ్
*(Canyan)కాన్యన్*:-- నీటి వలన కోతకు గురైన లోతైన,పొడవైన లోయ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment