🌸నవరాత్రులు దుర్గామాత తొమ్మిది అవతారాలను పూజిస్తాం. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.
🌿అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.
🌸అమ్మను అలంకరించే విధానం..
ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి.
🌿దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని, బ్లౌజ్ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.
🌸ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేధ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.
🌿నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది.
🌸అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
🌿ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి..
అక్టోబర్ 03వ తేదీ.. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి.. అమ్మవారు దుర్గారవీ రూపంలో దర్శనమిస్తారు.
🌸ఆకుపచ్చ, ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరించాలి. దుర్గాదేవి బుద్ధికి నిదర్శనం. అమ్మవారికి చక్కెరపొంగలి, కదంబం, శాకాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
🌿ఏడవ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు.
🌸శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తే కూడా మంచిది అని చెబుతుంటారు. ఎందుకంటే లలితా పరమ శాంత రూపం కనుక....స్వస్తి..
No comments:
Post a Comment