త్యాగరాజకీర్తన..!!
పాట: కరుణా జలధే
రాగం: నాధ్ నామక్రియ
తలాం: ఆది
ప. కరుణా జలధే దాశరథే
కమనీయానన సుగుణ నిధే
చ1. నీ మయమేగానిలను-
నేమని నే దూరుదును (క)
చ2. నిజ దాసుల అనుభవమొకటి
నిను తెలియని జన మతమొకటి (క)
చ3. వలచుచు నామము సేయుదురే నిను
తలచుచు ప్రొద్దు పోగొట్టుదురే (క)
చ4. సుకృతములొప్పగింతురే నీ
ప్రకృతిని తెలిసియేగింతురే (క)
చ5. మనసారగ పూజింతురే నిను
మాటి మాటికి యోజింతురే (క)
చ6. నిను కనులకు కన కోరుదురే నవ
నిధులబ్బిన సుఖమును కోరరే (క)
చ7. నీవన్నిటయని పల్కుదురే
నీవే తానని కులుకుదురే (క)
చ8. తమలో మెలగుచునుందురే
తారక రూపుని కందురే (క)
చ9. భాగవత ప్రహ్లాద హిత రామ
భావుక త్యాగరాజ నుత (క)..
No comments:
Post a Comment