Adsense

Wednesday, December 28, 2022

షష్టీ మాత...!!

షష్టీ మాత...!!


🌸శుక్ల బహుళ పక్షాలలో వచ్చే 6వ రోజు షష్టి తిధి అవుతుంది. ఆ రోజున బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో 6 ముఖములతో వున్న దేవతని  గర్భరక్షణిగా, సంతాన భాగ్యదేవతగా పూజిస్తారు.

🌿ఈ దేవి 6 ముఖములు కలిగి వున్నందున షష్టీ దేవి అని పిలుస్తారు. మూడు ముఖములు ముందుకి, మూడు వెనుకకి వుండే ఈ దేవతకు
హస్తములు రెండు మాత్రమే వుంటాయి.

🌸ఆ దేవత చేతులలో ఏడు లేక ఎనమండుగురు పిల్లలు వుంటారు. ఆవిడకు పిల్లి వాహనం..

🌿షష్టీ దేవికి ప్రారంభ కాలంలో ఒక రూపమంటూ వుండేదికాదు. పెద్ద పెద్ద గంగాళాలలో నీరు పోసి, పేడతో వుండలు చేసి పూజించేవారు.

🌸క్రీ.పూ రెండవ శతాబ్దం కుషాణుల కాలంలో
షష్ఠి దేవి రూపం నాణేలపై ముద్రించారు.
షష్టీ దేవి అనాది దేవతగా భావించారు.

🌿పిదప 8,9 వ శతాబ్దాలలో వచ్చిన పురాణాలలో యీ దేవిని పార్వతీ దేవీగాను, దేవసేనగాను వర్ణించారు. షష్టీ దేవి ఉపాఖ్యానం
భాగవత బ్రహ్మాండ వైవర్త పురాణంలోను, దేవీభాగవత పురాణాలలో చేర్చబడింది.

🌸బెంగాలి వారి మంగళకావ్యంలో యీ దేవి కధ షష్టి మంగళ అనే పేరుతో  చేర్చబడినది.

🌿ఈ షష్టిమాతా దేవి మహత్యం గుజరాత్, బీహార్, హరియానాల వరకు వ్యాపించి 
"చాటీ మాత" గా కొలవబడుతున్నది. బీహార్ లో చైత్రమాసంలో, కార్తిక మాసంలో షష్టి రోజున "ఛాత్" పండుగ  ఉత్సవం జరుపుతారు.

🌸చంటిపిల్లలకు శుభాలనిచ్చే షష్ఠి...
స్త్రీ ప్రసవ సమయంలో సుఖ ప్రసవం జరగాలని షష్టీ దేవిని వేడుకుంటారు. ప్రతి మాసం షష్టినాడు షష్టీ వ్రత ఆచరిస్తూ ప్రతి మాసం షష్ఠి  దినాన..

🌿శాంతను, ఆరణ్య, కందమా, లునందనా, సాప్టి, దుర్గా, షష్టీ, అణ్ణా, మూలక, శీతలా, గో రూపిణి ,అశోక అనే పేర్లతో 12 మాసాలు షష్టీ దేవి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షలు, పూజలు చేస్తారు.

🌸ఆషాఢ మాసంలో  ఆరణ్య షష్టి లేక జమాయ్ షష్ఠి  జరుపుతారు. బెంగాల్ లో  భాద్రపద మాసంలో శీతలా షష్టి అనే పేరుతో దుర్గా పూజలు జరుపుతారు.

🌿ఆనాడు తమ సంతానం, పాడి పంటల సంపదలు  అభివృద్ధి చెంది, సుభిక్షంగా వుండాలని షష్టి వ్రతం ఆచరిస్తారు. లుందోన్ షష్టి అని బీరకాయని పెట్టి ఆనాడు పూజిస్తారు. మూలో షష్టి అని ముల్లంగిని నివేదిస్తారు.

🌸అరణ్య షష్టీ లేక జమాయ్ షష్టి అనేది కొంచెం వినోదాత్మకంగా వుంటుంది. షష్టినాడు
అత్తగారు తమ అల్లుడి దీర్ఘాయుస్సు కోసం వేడుకుంటూ యీ వ్రతం ఆచరిస్తారు.

🐈‍⬛️ షష్టీ దేవి  - నల్లపిల్లి..

🌿షష్టి దేవిని గురించిన కధ ఒకటి ఉత్తర దేశంలో  ప్రచారంలో వున్నది.  షష్టిదేవి పసి పిల్లల రక్షకురాలుగా వుడి కాపాడుతుందని
ధృఢంగా నమ్మే కధ.

🌸ఒక  ఇంటి కోడలు షష్టి వ్రతం చేస్తూ ఆకలి భరించలేక ఎవరికీ తెలియకుండా ఆహరాన్ని  భుజిస్తుంది. 

🌿ఆహారం తక్కువగా వుండడం చూసి, అత్తగారు అడిగినప్పుడు  అక్కడ వున్న నల్లపిల్లి తిన్నట్లు ఆ తప్పును పిల్లిపై నెట్టింది.

🌸ఆ తర్వాత ఆ కోడలికి పుట్టిన పిల్లలనందరిని ఆ నల్లపిల్లి రహస్యంగా తీసుకుని పోయి షష్టీ దేవికి సమర్పించేది. పుట్టిన పసికందులంతా అదృశ్యమవడం చూసి
అందరూ ఆ కోడలిని పిల్లలని చంపే రాక్షసిగా
భావించి భయంతో దూరం చేశారు.

🌿మరు ప్రసవం లో పుట్టిన బిడ్డను ఇంట్లోని  ఆ నల్లపిల్లి తీసుకుపోతూండడం ఆ ఇంటి కోడలు గమనించి ఆ నల్లపిల్లిని వెంటాడినది.
ఆ నల్లపిల్లి తిన్నగా బిడ్డను షష్టీ దేవి ఆలయం లోపలికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించింది. 

🌸కోడలు షష్టీ దేవిని ప్రార్ధించి తన పిల్లలని తిరిగి యివ్వమనగా., దేవి... ఆమెని చేసిన తప్పుకు పశ్చాత్తపపడుతూ ఆ నల్లపిల్లిని  క్షమాపణ కోరుకొమ్మని ఆదేశిస్తుంది.

🌿కోడలు తన తప్పు తెలుసుకుని నల్లపిల్లిని
క్షమార్పణ అడిగుతుంది. కరుణామయి అయిన షష్టీమాత ఆమె ఏడుగురి పిల్లలను దీవించి తిరిగి యిచ్చి పంపిస్తుంది.

🌸ఆనాటి నుండి ఆ ఇంటి కోడలు తన పిల్లల క్షేమం కోసం శుక్లపక్ష షష్టినాడు ఉపవాసం చేస్తూ షష్టీదేవిని పూజిస్తూ వుండేది.

🌷షష్టీ దేవి..పార్వతీ దేవి..

🌿షష్టీ దేవి పూజలు ఆదికాలంలో సంతానానికి సంబంధించిన పూజగా ఉత్తర దేశంలో వుండేది.

🌸బెంగాల్ లో మాత్రం షష్టీ దేవిని పార్వతీ దేవిని వేరు వేరుగా భావిస్తారు. శివునిచే వినాయకుని తల నరికబడిన సమయాన పార్వతీ దేవి ఈ షష్టీ దేవిని వేడుకున్నదనే కధ బెంగాల్ లో వినిపిస్తుంది.

🌿అయితే మిగతా రాష్ట్రాలలో ఆదికాలంలో  షష్టీ దేవిని పార్వతీ దేవి పేరుతో
పూజించబడేది. పిదప ఈ దేవి ఆరు ముఖాలు కుమారస్వామిని పెంచిన కార్తిక కన్యల ఆరుగురు అంశగా తెలిపారు.

🌸కొన్ని పురాణాల స్కందుని భార్య దేవసేనయే ఈ షష్టి దేవత అనడం వుంది. సుబ్రమణ్య స్వామి అర్ధాంగియైన దేవసేనకు గల  పేర్లలో షష్టీదేవి పేరు కూడా ఒకటి.

🌿భారతదేశంలో అనేక గ్రామాల్లో షష్టీ దేవి గర్భరక్షిణి దేవిగా పూజింపబడుతున్నది...స్వస్తి...
- సేకరణ

No comments: