Adsense

Wednesday, December 28, 2022

బ్రహ్మముహూర్త కాల సమయం




🌸 తెల్లవారు ఝామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త కాల సమయం 2 గంటలు ఉంటుంది.ఈ రెండు గంటల కాల సమయములో ఓజోన్ అనేటటు వంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది.

🌿 ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి చాలా మంచిది. కనుక అందరూ తెల్లవారు ఝామున అనగా ఉదయం 4 నుంచి 6 గంటల లోపల స్నానం చేయాలి. అంతేకాకుండా మరియొక కారణం కూడా ఉన్నది, ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని, అందువలన ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడౌతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం.

🌸 అందుకే హిందూ సాంప్రదాయకమైన దేవాలయాలన్నియు భగవంతుని మేలుకొల్పు, సుప్రభాతము మొదలగు పూజా కార్యక్రమములతో ప్రారంభమవుతూ ఆ సమయంలోనే కోవెలలన్నీ తెరువబడతాయి.

🌿 సుమారు 6 లేక 7 గంటల నిద్రవలన మానవుల తనువు తేలికబడి, మనసు ఉల్లాసంగా నిర్మలముగా ఉండి, వారు చేయు పని పట్ల ఏకాగ్రత కుదురుతుంది. అంతేకాక వారిని ఆటంకపరిచే నిత్యమానవ విధులేవి ఆ సమయమునంద ఆరంభము కావు.

🌸 అందువలన దీక్ష కాలమున బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవి శిరస్నానమాచరించి స్వామిని సేవించవలెనని నియమము విధించారు.

         🌷
వత్తులు 🌷

🌿 1) ఒక వత్తి : సామాన్య శుభం

🌸 2) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం

🌿 3) మూడు వత్తులు : పుత్ర సుఖం

🌸 4) ఐదు వత్తులు : ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం, అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము.

    🌷  దీపారాధన విధానం  🌷

🌿 1) నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును.3

🌸 2) నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, పీడలు తొలగును.

🌿 3) ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన, దేదీప్యమానమగు జీవితం, బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధియగును.

🌸 4) వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును.

🌿 5) నెయ్యి, ఆముదం, వేప నూనె, కొబ్బరి నూనె, యిలుప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన, వారికి దేవీ అనుగ్రహం కలుగును.

🌸 6) వేపనూనె, నెయ్యి, యిలుపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును.

🌿 7) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వరుభములు, శాంతి కలుగును.

🌹 దీపాల యొక్క దిక్కుల ఫలితములు 🌹

🌸 1) తూర్పు : కష్టములు తొలగును, గ్రహదోషములు పోదురు.

🌿 2) పశ్చిమ : అప్పుల బాధలు, గ్రహదోషములు, శనిదోషములు తొలగును.

🌸 3) దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును,

🌿 4) ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబములో శుభకార్యములు జరుగును.

🌹 దీప వత్తుల యొక్క ఫలితములు 🌹

🌸 1) పత్తి :- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును.

🌿 2) అరటినార :- అరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును.

🌸 3) జిల్లేడినార :- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాల బాధలు ఉండవు.

🌿 4) తామర నార :- పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతులగుదురు.

🌸 5) నూతన పసుపు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు.

🌿 6) నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును, గొడ్రాలికి సంతానము కల్గును.

🌸 7) నూతన తెల్ల వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును.

🌿 సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం, సౌభాగ్యం కల్గును..స్వస్తి.

No comments: