Adsense

Thursday, February 9, 2023

పసుపు, కుంకుమ

🌺 పసుపు 🌺

పసుపు గౌరీదేవికి ప్రీతికరం. ఇది సౌభాగ్యానికి గుర్తు. కావున పసుపును ముందుగా ఇస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజలు జరిగేటప్పుడు అక్కడ మీకు పసుపు ప్రసాదంగా లభిస్తే దానిని ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కలప టానికి లేదా స్నానం చేసే నీళ్ళలో వాడతారు.

అదేవిధముగా ఆ పసుపు మీ పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం పూజిస్తే ఇంట్లో ఉన్నవారికి, అన్ని విధాలా బాగుంటుంది.

అమ్మవారికి పసుపు చీరను ఇచ్చి దానిని మరలా తిరిగి ఇంటికి తెచ్చు కుని పూజిస్తే ఇంట్లో సౌభాగ్యం కలుగుతుంది.

ప్రతి సంవత్సరం కామెర్లు వ్యాధికలిగిన వారు ముత్తయిదువులకు పసుపు రంగు చీర, తాంబూలమును దానంగా ఇస్తే కామెర్ల సమస్యలు రాకుండా ఉంటాయి.

🌺 కుంకుమ 🌺

కుంకుమ అమ్మవారికి ప్రీతికరం.
కుంకుమను గుమ్మడికాయలో ఉంచి దిష్టి తీసి కొడితే దిష్టి దోషాలు దూరంగా పోతాయి.

అన్నంలో కుంకుమను కలిపి దిష్టి తీసి మూడు రోడ్లు కలిసి ఉండే స్థలంలో ఉంచితే దిష్టి దోషాలు పోతాయి.

కుంకుమును ప్రతిరోజు నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం పొందుతారు.

కుంకుమను దానం చేస్తే ఇంట్లో ఉండే అన్ని దోషాలు పోగలవు.

కుంకుమతో పూజ చేస్తే అందరూ దేవతలు సంతృప్తి పడతారు.

No comments: