Adsense

Thursday, February 9, 2023

మహా మాఘి - మాఘ పౌర్ణమిశ్రీ లలితాదేవి జయంతి.


మహా మాఘి - మాఘ పౌర్ణమి
శ్రీ లలితాదేవి జయంతి.

శ్రీ లలితాదేవి అమ్మవారు
శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా ,
పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా
సకల లోకాలకు తల్లి .
శ్రీమత్సింహాసనేశ్వరి అయిన
ఈ తల్లికి కుడివైపున శ్రీ మహాసరస్వతీ దేవి ,
ఎడమవైపున శ్రీ మహాలక్ష్మి దేవి
వింజామరలు వీస్తూ సేవలు చేస్తుండగా ,
కదంబ నివాసినియై ,
సాక్షాత్ పరమేశ్వర సింహాసనేశ్వరియై ,
సృష్టి , స్థితి , లయలకు అధికారిణియై ..
సకల దేవతలకు శక్తిని ,
మానవాళికి భుక్తి ముక్తులను ,
సువాసినులకు మాంగళ్య బలాన్ని ప్రసాదిస్తూ ,
అత్యంత దుష్ట భయంకరుడైన
భాండాసురున్ని సంహరించి ,
కారాంగూళి నఖోత్పన్న నారాయణ దశాకృతై ,
లోకోత్తర లావణ్య భావంతో ,
చిన్మయ చైతన్యం తో ,
అణువు అణువులో ఆడి పాడి ఓలలాడే
లీలావతీ లలితా పరమేశ్వరీ
సమస్త లోకాలను చల్లని చూపులతో అనుగ్రహిస్తోంది.
ఈ తల్లి నామాన్ని స్మరిస్తే చాలు.
సర్వ మంగళాలు కలుగుతాయి .
ఈ తల్లిని దర్శనం చేసుకోవడంతోనే
సమస్త ఐశ్వర్యాలు లాభిస్తాయి.
శ్రీ లలితాదేవి అమ్మవారు
అఖిలలోకాల పరిపాలనా సంస్థానానికి
శ్రీ శ్యామలదేవి అమ్మవారిని మంత్రిగా ,
సర్వ సైన్యాధికారిణిగా
వారాహి అమ్మవారిని నియమించుకొని
సర్వలోకాలను పాలిస్తుంది.
ఈ తల్లి చెంత చేరి ,
అమ్మా ! నీ బిడ్డను నేను ,
నన్ను ఆదుకో తల్లీ అని వేడుకొంటేనే
మాతృత్వంతో అక్కున చేర్చుకొని ఆదుకొంటుంది.
ఈ తల్లికి శ్రీ చక్రార్చన , పంచదశాక్షరీ జపం ,
లలితా సహస్రనామ స్తోత్రముల పారాయణాలకు
అత్యంత పరవశించి పోయి
తనను ఆరాధించే బిడ్డలకు అపమృత్యు ,
కాల మృత్యు దోషాలను తొలగించి,
దీర్ఘాఆయుస్సును , ప్రజ్ఞను , కీర్తి ప్రతిష్టలను ,
సకల సంపదలను ప్రసాదిస్తుంది.
▫️
తులసిమొక్కను నాటండి
భగవద్గీతను చదవండి.
గోమాతను పూజించి సంరక్షించండి.

No comments: