Adsense

Thursday, February 9, 2023

మాఘపూర్ణిమ - శ్రీ లలితా జయంతి

తేదీ.   ... 05 - 02 - 2023,
వారం ...  భానువాసరే ( ఆదివారం
*మాఘపూర్ణిమ - శ్రీ లలితా జయంతి*
ఆదిశక్తి రూపాలైన  త్రిపురాత్రయం లో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం.
ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత,పంచదశాక్షరీమంత్రాధిదేవత, భండాసురుణ్ణి వధించడానికిమాఘ పౌర్ణమినాడు శ్రీ లలితాదేవి ఆవిర్భ వించినట్టు పురాణాలు చెబుతున్నాయి...

*‘మఘము’* అంటే యజ్ఞం, యజ్ఞ, యాగాలూ, పవిత్రమైనదైవకార్యాలూచేయడానికిఅత్యున్నతమైనదిగా మాఘ మాసాన్నిపెద్దలుప్రస్తుతిం చారు.
అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి.
దీన్నే *"మహా మాఘి"* అనికూ డా అంటారు.
ఈరోజునచేసేసముద్ర, నదీ స్నానాలు, పూజలుఅపారమైన ఫలాలనుఇస్తాయన్నదిశాస్త్రవచనం.
*లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.*
లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది.
భండాసురుడు అనే రాక్షసుడు శివు డి కోసం తపస్సు చేశాడు, శివుడు అతని తపో నిష్టకు మెచ్చి, ప్రత్యక్ష మయ్యాడు.
ఎవరైనాతనతోయుద్ధం చేస్తే..ఆ ప్రత్యర్థిబలంలోసగంతనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు.
శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడువరగర్వంతోవిజృం భించిన భండాసురుడు తనసోదరు లతో కలిసిమూడులోకాలనూపీడిం చడం మొదలుపెట్టాడు.
అతనుపెట్టే బాధలను భరించలేక..... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతనుఆరాధించారు.
మహాయాగం చేశారు.
ఆ హోమగుండంనుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భ వించి, శ్రీచక్రాన్నిఅధిష్ఠించి,భండాసు రుణ్ణి సంహరించింది.

ఆమెరౌద్రరూపాన్నిశాంతింపజేయడానికి దేవతలు, మునులుప్రార్థిస్తూ పలికిన నామాలే *‘శ్రీ లలితా సహ స్రనామం’* గా ప్రాచుర్యం పొందాయి.
కామేశ్వరుణ్ణిలలితాదేవి పరిణయమాడింది, సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి.

సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు.
అందుకే... అమ్మవారిని ఏరూపంలో పూజించినా *‘లలితాసహస్రనా మా’* న్ని పఠిస్తారు.
అరుణవర్ణంలో ప్రకాశిస్తూ, పాశాన్నీ, అంకుశాన్నీ,పు ష్పబాణాలనూ,ధనస్సునూనాలుగు చేతుల్లోధరించి ఆమెదర్శనమిస్తుంది.
శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి, శాంతినిప్రసాదించే తల్లిగాకొలుస్తారు.
దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ, పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళ ల్లోప్రావీణ్యాన్నీ, కుటుంబసౌఖ్యాన్నీ, ప్రశాంతతనూ, సంపదనూప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక.
ప్రత్యేకించి *శ్రీ లలితాదేవి జన్మదినమైనమా ఘ పౌర్ణమిరోజున.*
పవిత్రస్నానా లు చేసి, లలితా సహస్రనామ పఠ నంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే *‘ప్రా తః స్మరామి లలితా వదనార విందం...’*  అంటూ ప్రారంభమ య్యే *‘శ్రీలలితా పంచ రత్న స్తో త్ర’* పారాయణ కూడా విశేష ఫల ప్రదమనీ పెద్దల మాట.

సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవినిఆరాధిస్తారు.
అందుకే...అమ్మవారిని ఏ రూపంలో పూజిం చి నా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు.

మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి.
దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీస్నానాలు, పూజలు అపారమైన ఫలాలనుఇస్తా యన్నది శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరోప్రత్యేకత.

No comments: