Adsense

Thursday, February 23, 2023

Current Affairs - GENERAL KNOWLEDGE

ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ పేరు వెర్సునిగా మార్చబడింది. రాయల్ ఫిలిప్స్ తన దేశీయ ఉపకరణాల వ్యాపారాన్ని సెప్టెంబర్ 2021లో హిల్‌హౌస్ క్యాపిటల్‌కు విక్రయించిన తర్వాత ఇది జరిగింది.
--------------------
ప్రపంచంలో ఎక్కువగా అక్రమంగా తరలించే క్షీరదాల జాబితాలో పాంగొలిన్ మొదటి స్థానంలో ఉంటుంది. 2000-2019 మధ్య దాదాపు 9 లక్షల పాంగొలిన్లను అక్రమంగా రవాణా చేశారని 'ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్' వెల్లడించింది. ప్రపంచంలో పొలుసులుండే ఏకైక క్షీరదం ఇదే. పాంగొలిన్ పొలుసులకు డిమాండ్ ఎక్కువ. వీటిని చైనా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి ఆస్థమా, క్యాన్సర్ లాంటి వ్యాధులపై చికిత్సలో ఉపయోగపడతాయని అక్కడి ప్రజల నమ్మకం. అయితే, అధ్యయనాల్లో దీన్ని రుజువుచేసే ఫలితాలేమీ కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు. వీటి మాంసానికి కూడా డిమాండ్ ఎక్కువ. చాలా ఆసియా దేశాల్లో మాంసం కోసం కూడా వీటిని వేటాడుతుంటారు.

వీటి పొలుసుల్లో కెరాటిన్ ఉంటుంది. మనుషుల గోర్లలోనూ కెరాటిన్ కనిపిస్తుంది.

పొడవైన నాలుకతో ఇవి చీమలు, చిన్నచిన్న పురుగులను తింటుంటాయి.

----------
హరియాణాలో ఉత్తర భారత తొలి అణు కర్మాగారం నిర్మాణం:

ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రాన్ని హర్యానాలోని గోరఖ్ పూర్ లో నిర్మిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం:- 1,400 మెగావాట్లు.

స్వదేశీ డిజైన్ కలిగిన ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (పిహెచ్ డబ్ల్యుఆర్) యొక్క 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో గోరఖ్ పూర్ హర్యానా అను విద్యుత్ పరియోజన (జిహెచ్ఎవిపి) హర్యానాలోని గోరఖ్ పూర్ గ్రామానికి సమీపంలో నిర్మాణం లో ఉంది.

--------

సియాటెల్ కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచింది.

ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అమెరికాలో 1980 నాటికి 2,06,000 మంది భారతీయులు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పెరిగిందని మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ గణాంకాలు చెప్తున్నాయి.

గత మూడేళ్ల కాలంలో అమెరికాలోని అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధించడానికి ముందుకొచ్చాయి. 2019 డిసెంబర్‌లో బోస్టన్ సమీపంలోని బ్రాండీస్ యూనివర్సిటీ తమ వివక్ష రహిత విధానంలో కులాన్ని చేర్చింది. అలా కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా యూనివర్సిటీగా అది గుర్తింపు పొందింది.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కాల్బీ కాలేజ్, బ్రౌన్ యూనివర్సిటీ వంటివీ అదే మార్గంలో నడిచాయి. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా 2021లో ఈ తరహా విధానం తీసుకొచ్చింది.

భారతదేశంలో 1948లో కులవివక్షను నిషేధించారు. 1950లో కుల వివక్ష వ్యతిరేక విధానాన్ని రాజ్యాంగంలోనూ చేర్చారు.

----

సీల్డ్ కవర్ న్యాయశాస్త్రం (SCJ) అనేది ఒక సీల్డ్ కవరు లేదా కవర్‌లో సున్నితమైన లేదా గోప్యమైన సమాచారాన్ని కోర్టు లేదా ట్రిబ్యునల్‌కు సమర్పించే అభ్యాసాన్ని సూచించే ఒక చట్టపరమైన భావన, ఇది కేసుకు బాధ్యత వహించే న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు మాత్రమే తెరిచి సమీక్షించవచ్చు.

--------
పారిస్ క్లబ్

-ఇది అధికారిక రుణదాతల అనధికారిక సమూహం• దీని పాత్ర రుణగ్రహీత దేశాలు అనుభవించే చెల్లింపు ఇబ్బందులకు సమన్వయ మరియు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడం.

-పారిస్ క్లబ్  1956లో ఆవిర్భావించింది.
ఇందులో ఆస్ట్రేలియా, యుకె, యుఎస్ఎ, జపాన్ మొదలైనటువంటి 22 శాశ్వత సభ్య దేశాల సమూహం.

-ఇందులో భారత్ సభ్యదేశం కాదు. ఇది అడ్ హాక్ పార్టిసిపెంట్ గా పనిచేస్తుంది.


No comments: