Adsense

Monday, March 27, 2023

చైత్ర శుద్ధ పంచమి.నాగ కృప కలిగెమార్గం...!!



అనంత సౌభాగ్యాలు కలిగేందుకు ,
సత్సంతానం కొరకు ,
సంతానానికి రక్ష కొరకు
చైత్ర శుద్ధ పంచమి..


సాయంత్రము పూజానంతరం ప్రత్యక్ష దైవాలైన నాగులను స్మరించుకోవాలని
శాస్త్రాలు చెబుతున్నాయి.

నాగజాతి మనకు కనపడే ప్రత్యక్ష దైవాలు.మనతో సహజీవనం చేస్తున్న
దైవాలే నాగులు.మన హైందవ సంస్కృతిలో పాములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మన పురాణ గ్రంథాలలో ,
చరిత్రలో , జానపద గాథలలో ,
నిత్యజీవితములో నాగ జాతి ప్రస్తావన
వస్తూనే ఉంటుంది.

స్వర్గ లోకంలో దేవతలు ,
భూలోకంలో మానవులు ,
పాతాళ లోకంలో నాగులు
నివసిస్తూ వుంటాయి.
నాగ జాతి అతి గొప్ప జాతి.

బ్రహ్మ పుత్రుడైన మరీచి మహర్షి కుమారుడే కశ్యప మహర్షి .
ఈయన దక్ష ప్రజాపతి కూతురైన
కద్రువను వివాహమాడితే..
వీరికి అనంత , తక్షక , వాసుకీ ,
కంబళ , కర్కోటక , పద్మ , మహా పద్మ ,
శంబి , కుళిక  అనే
నవ నాగ సంతానం కలుగుతుంది.

🌿పాతాళ లోకంలో వుండే
నాగ రాజధాని పేరు భోగావతి రాజ్యం.
ఈ భోగావతి రాజ్యం
ఇంద్రుని రాజధాని అయిన
అమరావతి కంటే బాగుంటుందని
సాక్షాత్ నారద మహర్షే చెప్పాడంటే..
నాగులు అందచందాలతో
అత్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడంలో
గొప్ప ఘనులని తెలుస్తుంది.

శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో
శయనించేది నాగ జాతి అయిన
ఆది శేషుని మీదే.
అందుకే ..శ్రీ మహావిష్ణువును
శేష శైలా వాసా అని ,
శేషాశాయి అని స్మరించుకొంటాం.

" మహార్ణ వాదౌ పర్యంక
శాయి సంచ నరః స్మరేత్
"

అని స్మరిస్తే సముద్రంలో
ప్రయాణం చేస్తున్న వారైనా ,
సముద్రంలో పడిన వారైనా
క్షేమంగా తీరం చేరుతారని పెద్దలు చెబుతారు. కవ్వంగా ఉండేందుకు
మేరు పర్వతం అంగీకరిస్తే ,
ఆ కవ్వానికి తాడుగా ఉండేందుకు
ఒప్పుకున్న సర్పరాజైన వాసుకి వల్లే
దేవతలు, దానవులు
క్షీర సాగర మథనం చేయగలిగారు.

అమృతం పుట్టడానికి కారణం
సర్పరాజు సహకారం వల్లనే జరిగిందని
పురాణాలు చెబుతున్నాయి.
అమృతాన్ని ఎల్లవేళలా
కాపలాగా సంరక్షించేది ఈ నాగ జాతే.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
అంటూ పరమశివుని స్మరిస్తూ వుండేది

ఈ నాగ జాతినే
శివుని మెడలో పూలదండలుగా
వెలుగుతూ వుండేది ఈ నాగ జాతే.
విఘ్నేశ్వరునికి తన పొట్టకు
పట్టీలా ఉపయోగించుకొనేది ఈ నాగజాతినే.

రాక్షస సంహరంలో దేవతలు
నాగస్త్రాన్ని ఉపయోగిస్తారు.
యమునా నదిలో కాళీయుడనే సర్పంమీద నిలబడి శ్రీ కృష్ణుడు కాళీయమర్ధనం చేసింది ఈ నాగ జాతిమీదనే.

ద్వారక సమీపంలో
సౌరాష్ట్రంలో నాగేశ్వరలింగం వుంది.
దానినే శ్రీ నాగనాథ పుణ్య క్షేత్రం అని పిలుస్తారు.

శ్రీ నాగనాథ క్షేత్రంలో మహేశ్వరుడుగా
జ్యోతిర్లింగ స్వరూపుడుగా కొలువై
భోగిభోగములతో ,
సువర్ణ నాగాభరణములతో
అలంకరించుకొని
భక్తులకు మృత్యు భయాలను ,
శత్రు భయాలను తొలగిస్తున్నాడు.

అటువంటి విధంగా..
సర్వ మానవాళికి మేలు చేస్తున్న
నాగ జాతిని ప్రతీ మాసం పంచమి రోజుల్లో పూజించుకొందాం.

పాహి పాహి సర్ప రూపా
నాగదేవా ! దాయామయా !!
సత్సంతాన సంపత్తిం
దేహిమ్ శంకర ప్రియ

అనంతాది మహనాగ
రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర
సౌభాగ్యం దేహిమ్ సదా


అంటూ ప్రార్థన చేస్తే తప్పకుండా
నాగ కృప కలిగి
అనంత సౌభాగ్యాలు కలిగి ,
సంతానానికి రక్ష కలుగుతుంది...స్వస్తీ..సేకరణ.

No comments: