Adsense

Monday, March 27, 2023

మహా లక్ష్మీ నమోస్తుతే!..!!




ఓం..శ్రీం..హ్రీం..ఐం..ఓం..
కుబేర లక్ష్మీ యై
కమలధారిణ్యై ధనాకర్షిణ్యై
సింహవాహిన్యై శ్రీ యైనమః

భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం వున్న గృహాలమీద  ఏ విధమైన దుష్ట శక్తులు చేయవు. ఆ ఇంటికి నవగ్రహాలు కూడా మంచినే చేస్తాయి తప్ప  కీడు కలిగించవు.

మరి ఆ దైవం ప్రసన్నుడై  మన ఇంట్లో కొలువై వుండడాని కై మన పూర్వీకులు  ఎన్నో వ్రతాలు, పూజలు, ధర్మాలు, ఏర్పరిచారు.వాటిలో విశిష్టమైనది శ్రీ విద్యా ధ్యానం.

       శ్రీ విద్యా ధ్యానం.

అంబిక ని ధ్యానించి పూజించిన సర్వకార్యసిధ్ధి లభిస్తుంది.
దానితోపాటు  గృహంలో ఐశ్వర్య కారకమైన రంగవల్లులు కూడా
తీర్చి దిద్దితే లక్ష్మీదేవి కూడా కటాక్షించి సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

ఈ ఐశ్వర్య అష్ట దళపద్మాన్ని ,రంగవల్లిగా
దిద్ది,శుక్రవారం  రోజున పూజించాలి.
పూజని ప్రాతఃకాలానగాని,
సాయంకాలమునగాని,
ఆరు నుండి ఏడు లోపున
చేయడం విశిష్టమైనది గా చెప్తారు.

పూజా స్ధలం లో పచ్చి బియ్యప్పిండితో, అష్టదళపద్మం వేయాలి పసుపు తో కొంచెం సున్నాన్ని కలిపితే పారాణి తయారవుతుంది.
అప్పుడు అష్టదళపద్మములోని,
ఎనిమిది దళములను, పారణితో పూయాలి.

పద్మం  మధ్యలో 'శ్రీం' అని
వ్రాయాలి.  అష్టపద్మదళం
తయారవగానే, పచ్చి బియ్యప్పిండిలో,నెయ్యి తేనె ,చక్కెర వేసి కలిపిన ముద్దతో, ఎనిమిది ప్రమిదలు తయారు చేసి,
వత్తులు, నెయ్యి వేసి, దీపం వెలిగించడానికి సిధ్ధం చేసుకోవాలి.

అష్టదళపద్మ కొసలలో,
ప్రమిదలను వుంచి,దీపాన్ని వెలుపలి
ముఖంగా వెలిగించాలి.
ఐశ్వర్య రంగవల్లికి తూర్పు ముఖంగా ఆశీనులై,ఎనిమిది దీపాలముందు, అష్టలక్ష్ములను,ధ్యానించి, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని శ్రధ్ధతో  పఠించి,
అర్చించాలి.

తరువాత పైన చెప్పిన
ధనాకర్షణ మూల మంత్రాన్ని, నూట ఎనిమిది సార్లు జపించాలి.

పాలతో పాయసం చేసి,
మహాలక్ష్మి కి నివేదించి,
దీపారాధన చేయాలి.

ఈవిధంగా , వరుసగా ఎనిమిది వారాలపాటు‌,మహాలక్ష్మిని భక్తితో ఆరాధించి,పూజించిన భక్తులకు,
మహాలక్ష్మి  దేవి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ...స్వస్తి...

No comments: