Adsense

Thursday, March 30, 2023

శ్రీరామదాసు కీర్తనలు.రామయ్యకు ముత్యాల హారాలు..!!

*(శ్రీరామ నవమి సందర్భంగా..!!)

శ్రీరామదాసు కీర్తనలు.రామయ్యకు
   ముత్యాల హారాలు..!!

*ఏ తీరుగ నను దయచూసెదవో…!!

*పలుకే బంగామాయెరా..!

*అంతా రామమయం…!!

భద్రాచల రామదాసు(1620….1688)
గా ప్రసిద్ధి పొందిన ఈయన అసలు పేరు
కంచెర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండ
పల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతు
లకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు
గా సుప్రసిద్ధుడైనాడు. కుతుబ్ షాహీ "తానీ
షా"  ప్రభుత్వంలో ఓ రెవెన్యు ఉద్యోగి.రామ
భక్తుడు..భద్రాచలం వద్ద ప్రభుత్వ సొమ్ము
తో గోదావరి నది ఒడ్డున ప్రసిద్ధ సీతా రామ
చంద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు..ఫలి
తంగా నవాబు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చు..!

గోల్కొండ జైలులో 12 సంవత్సరాలుజైల్లో
వున్నాడు.. ఆయన జీవితం గురించి వివిధ పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
భక్త రామదాసు తెలుగులో తొలి వాగ్గేయ
కారుడు..తెలుగులో కీర్తనలకు ఆద్యుడు.
దాశరధి శతకంతో పాటు  రామ సంకీర్తనలు,
రచించాడు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం
లో రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.
ది హిందూ ఆంగ్ల  దినపత్రిక ప్రకారం, రామ
దాసు దాదాపు 300 పాటలు కంపోజ్ చేసి
నట్లు తెలుస్తోంది.!

రామదాసు పేరుతో ఆరు సంకలనాలు ఉన్నా
యి, వాటిలో నాలుగు రామదాసు చరిత్ర అని ఒకటి భద్రాచల రామదాసు అని, మరొకటి భక్త రామదాసు అని వున్నాయి

రామదాసు ఖైదు గోడ పై సీతారామలక్ష్మ
ణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తిస్తూ " శ్రీ రాముని కటాక్షం కోసం ఆక్రో
శిస్తూ కాలం గడిపాడు.!!

రామదాసుప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలంలోనే
వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి, మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అను
కోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము,లక్ష్మ
ణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి..!!

శ్లో. శ్రీ రామచంద్ర శ్రితపారిజాత

సమస్త కళ్యాణ గుణాభిరామ

సీతా ముఖాంభోరుహ చంచరీకో

నిరంతరం మంగళ మాతనోతు."!

రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితాన్ని గడిపాడు.త్యాగరాజా
దులకు ఆద్యుడు,పూజ్యుడు ఈ రామదాసు.
త్యాగరాజు కీర్తన "ధీరుడౌ రామదాసుని బంధ
ము దీర్చినది విన్నానురా రామా?" ఇంకా… ప్రహ్లాద విజయంలో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామ
దాసు వినుతింతు మదిన్" అంటూ రామ
దాసు నుకీర్తించడం విశేషం..!!

*పలుకే బంగారం....కీర్తన..!!

పల్లవి:

పలుకే బంగారమాయెనా కోదండపాణి
కోదండపాణి పలుకే బంగారమాయెనా

అనుపల్లవి:పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి…
కలలో నీనామ స్మరణ మరువా చక్కని తండ్రి

*చరణం1:

ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతాభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి

చరణం2:

ఎంత వేడినా నీకు సుంతైనా దయరాదు
పంతము సేయగ నేనంతటి వాడను తండ్రి

చరణం3:

శరణాగతాత్రణ బిరుదాంకితుడవు గాన
కరుణించు భద్రాచల వరరామ దాస పోషక

చ 2*

ఏ తీరుగ నను దయచూసెదవో
ఇనవంశోత్తమ రామా!!

నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా ఏతీరుగ

చ 1*

శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా..
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏతీరుగ

చ 3*

క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా…
దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా ఏతీరుగ

చ 4*

వాసవ కమల భవాసురవందిత
వారధి బంధన రామా..
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏతీరుగ

చ 5*

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామాగురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ..

చరణం 5:

నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ..

చరణం‌6:

వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ..

చరణం7:

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ..

పల్లవి: అంతా రామమయంబీ జగమంతా రామమయం అం..

చరణం1: అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ అం..

చరణం2: సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు అం..

చరణం3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం..

చరణం4: నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు అం..

చరణం 5*

అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము అం..

చరణం 6*:

ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము అం..

*ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె 
రామచంద్రా

పల్లవి:

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా..

చరణం1:

చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..

చరణం2:

గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా!

చరణం3:

భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా !..

చరణం4:

శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా !

చరణం5:

లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా !

చరణం6:

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా !.

చరణం7:

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా

చరణం8:

కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా !

చరణం9:

మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా !

చరణం10:

అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా !

చరణం11: సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా !

చరణం12

ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా..!

చరణం13:

కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా..

చరణం14:

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము"

*దాశరథి శతకం…!!

*చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం

జొక్కపు జుంటితేనియకు జొకిలుచుం గనలేరు గాక నే

డక్కట! రామనామమధురామృతమానుటకంటె సౌఖ్యామా

తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ."!!

ఈ కాలం జనం  చక్కెరకు,యువతి పెదవి
కి, తేనెకు మోజుపడుతున్నారు..అయితే
శ్రీరాముని పేరులో వున్న తీపిని మాత్రం
ఎరుగలేకపోతుపహన్నారు..రాముని పేరు
లో వున్న  తీయదనం కంటే పై వాటిలోని
తీయదన మంత సుఖమా!అంటున్నాడు
రామదాసు..!!

No comments: