Adsense

Sunday, March 26, 2023

లక్ష్మీ శ్లోకం ...!!





🌿లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం
శ్రీరంగ ధామేశ్వరీం

🌸దాసీ భూత సమస్త దేవ వనితాం
లోకైక దీపాంకురాం

🌿శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్
బ్రహ్మేంద్ర గంగాధరాం

🌸త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం
వందే ముకుంద ప్రియాం..

🌷తాత్పర్యం:🌷

🌸లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు.

🌿బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే.

🌸పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

No comments: