వసంత రుతువులో ఛైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సంప్రదాయం భద్రాచలంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది.
చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది..
🎻🌹🙏 నేడు ధర్మరాజు దశమి...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా.
🌸అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు.
🌿చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు.
🌸 అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు.
🌹🙏ఏమిటీ ధర్మరాజ దశమి!🙏🌹
🌿చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు జరుగుతుంది.
🌹ఎవరు ఈ నచికేతుడు??🌹
🌸పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.
🌹ఏమిటీ నచికేతుడి కథ!🙏🌹
🌿వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి.
🌸కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తనదగ్గరున్న ఆవులలో పలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు.
🌿అది నచికేతుడికి నచ్చలేదు "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి?? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అన్నాడు నచికేతుడు.
🌸కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించద్దు అన్నాడు వాజశ్రవుడు.
🌿అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చిరవరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అన్నాడు.
🌸ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్నమాట జరగకుంటే మంచిదికాదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు.
🌿యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో. నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు.
🌹నచికేతుడి మూడు వరాలు!!🌹
🌸యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా
🌿1.నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.
🌸రెండో కోరికా
🌿స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు.
🌸మూడవ కోరికగా
🌿మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు.
🌸మొదటి దానికి యముడు సరేనంటాడు.
🌿రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. (స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో)
🌸మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు.
🌿 అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి తొణకడు.
🌸ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదనేది ఇందుకే. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది.
🌿స్వామి వివేకానంద అంటాడు. నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా??..స్వస్తీ...
సమస్త లోకా సుఖినోభవంతు.

No comments:
Post a Comment