Adsense

Monday, March 27, 2023

తలపై శిఖ ఎందుకు..?





🌿తలపైఉండే జుట్టుముడినే శిఖ అనీ, (చూడా) అనీ అంటారు. చిన్నపిల్లలకు చేసే ఈ సంస్కారాన్నే (చూడాకరణం) అనీ, చేలమని పిలుస్తారు.

🌸మన శరీరం ఒక విద్యుత్ కేంద్రం. దీనిలోని విద్యుత్ ఉత్పాదనలో ఎక్కువ తక్కువలొచ్చి ఆరోగ్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది.

🌿ఉపనయన సమయంలో, మంత్రోపదేశం చేసేటప్పుడు విద్యుత్ పెరిగిపోకుండా ఆయుష్కర్మ (వపనం=క్షురకర్మ) చేసి, పిలక పెట్టడం వల్ల విద్యుత్తు కొంతతగ్గి, శిరస్సుకు రక్షణ ఏర్పడుతుంది.

🌸శిఖ అరచేతి అంత, గోష్పాదమంత ఉండాలని శాస్త్రం. పంచశిఖల్ని ఉంచుకోవడం వల్ల వివేకం, ధృఢత్వం, దూరాదర్శనం, దయ, నిగ్రహం కలుగుతాయి.

🌿(సదోపవీతి నా భావ్యం, సదాబుద్ధ శిఖేనచ, విశిఖో వ్యుపవీతశ్చయ త్కరోతి నతత్కృతమ్)

🌸అంటే శిఖలేనివాడు, జందెం లేనివాడు చేసిన ధర్మకార్యాలు ఫలమునివ్వవు అని బోధాయనవచనం.

🌿శిరస్సుపై బ్రహ్మ రంద్రముంటుంది. ఆ సహస్రారమే ఆత్మకు కేంద్రస్థానం. ఇక్కడే సాత్విక ఆధ్యాత్మిక శక్తులుంటాయి.

🌸 వీటిని రక్షించుకోవడానికి ఆవుడెక్కంత పిలక ఉంచుకోవాలి. శిఖ తీసేస్తే కామవికారం పెరుగుతుంది.

🌿కాబట్టే మునులు, బ్రహ్మచార్యులు, యోగులు, గర్భిణీ స్త్రీ భర్తలు జడలు, గడ్డాలు పెంచి ఇంద్రియ నిగ్రహం అలవరచుకునేవారు...స్వస్తి..

No comments: