Adsense

Monday, March 27, 2023

జ్వాలాజీ మాత

షాజహాన్ అంతకు ముందు ఎవరూ చేయలేని పనిని తను పూర్తి చేస్తానని బయల్దేరాడు సైన్యంతో సహా. కాని పఠాన్ కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా మాత గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి తేనెటీగలు వాడి సైన్యాన్ని చుట్టుముట్టి చంపేశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈ రోజుకీ కాగడా మాత, జ్వాలాజీ మాత గుళ్లలో ఆ ఆనవాళ్లు కనబడతాయి. తొమ్మిది రంగులలో గోడమీద జ్వాల వెలుగుతూంటుంది ఈ రోజుకికూడా. మినుకు మనుకు మంటూ ఆరడానికి సిధ్ధంగా వున్న జ్యోతి ఎప్పటినుండి అలా వెలుగుతోందో ఆర్కియాలజిస్టుల దగ్గర వున్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

హిందూ మతాన్ని విమర్సించే జన అఙ్ఞాన వేదిక వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు. ఎందుకంటే NASA scientists కూడా చాలా ప్రయోగాలు చేశారు. కింద భూమిలో పెట్రోలుందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టుపీక్కుంటూ వెళ్లిపోయారు. ఆ గుడిలోనే గోరఖ్ నాథుడి ఉపాలయం వుంది. ఎలాంటి వెంటిలేషన్ లేనిచోట ఒక గొయ్యి ప్రక్కనే ఒకటిన్నర అడుగు ఎత్తు వరకూ అఖండ జ్యోతి వెలుగుతూంటుంది. మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి. కానీ ఆ నీరు చల్లగా ఫ్రిజ్ వాటర్ మాదిరి చల్లగా వుంటాయి. ఈ మంటల ప్రభావానికి సాధారణంగా ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి కాని అలా జరగదు. ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాత ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణావస్థకు చేరుకుంది. ఈ మధ్య దానినికూడా బాగు చేశారు.

ఈ ఆలయంలో 9 జ్వాలలు ఉంటాయి ... ఆ జ్వాలలు నవ దుర్గా స్వరూపిణిలుగా ఆరాధించబడుతున్నారు ... ఈ తొమ్మిది జ్వాలలను ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఖంగ్ర లో ఉన్నది.

No comments: